అమ్మ: గర్భిణులు ప్రశాంతగా నిద్రపోవాలంటే ఇలా చేయండి..!!

N.ANJI
సాధారణంగా పెళ్ళైన ప్రతి మహిళ పిల్లలకు జన్మనివ్వాలని ఎన్నో కలలు కంటూ ఉంటారు. అలాగే పెళ్ళైన ప్రతి పురుషుడు కూడా తన వంశం నింపుకోవడం కోసం ఎన్నో ఆశలు పెట్టుకుంటూ ఉంటారు. ఇక ఇంటి ఇల్లాలు తల్లి అయిందని తెలిస్తే ఆ ఇంటిలో పండుగ వాతావరణం నెలకొంటుంది. ఇక గర్భం దాల్చిన మహిళలు చాలామందికి ఆహారం ఏం తీసుకోవాలో ఎక్కువగా తెలీదు. ప్రెగ్నెట్ కి ముందు ఎలా తీసుకునేవారో అలాగే తింటుంటారు. అయితే కొంతమంది ఇంట్లో పెద్దవాళ్లు ఏ ఆహారం చెబితే అదే తినేవాళ్లు. గర్భిణులు ఏ ఆహారం పడితే ఆ ఆహారం తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఇష్టానుసారంగా తినడం వలన దానిని ప్రభావంగా మంచి నిద్ర పొందలేకపోతారని చెబుతున్నారు. అంతేకాదు.. నెలలు దాటే కొద్ది నిద్ర ఒక సవాలుగా మారుతుందని సూచించారు. అయితే గర్భంలో పిండాశయం పెరిగే కొద్ది గర్భిణులు తక్కువగా నిద్రపోతారని చెప్పుకొచ్చారు. గర్భిణులు మంచి నిద్ర పోవాలంటే కొన్ని నియమాలను పాటించక తప్పదని అన్నారు.
గర్భిణులలో హార్మోన్ల ప్రభావం, మానసిక ఒత్తిడి కారణంగా రాత్రి పూట ప్రశాంతమైన నిద్ర పొందలేకపోతారు. ఇక గర్భిణులు పాటించాల్సిన కొన్ని చిట్కాలను ఒక్కసారి చూద్దామా. గర్భిణులు పడుకునే ముందు వేడి పాలను తాగాలని నిపుణులు చెబుతున్నారు.. పాలు తాగడం వలన ఆరోగ్యంతోపాటు నిద్రకు మేలు చేస్తుందని అన్నారు. అలాగే పిండి పదార్థాలను ఎక్కువగా తినాలని చెబుతున్నారు. అంతేకాక.. గర్భిణులు తీసుకునే ఆహారంలో ఆహారంలో ప్రోటీన్లు అధికంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. ఇక పగటి పూట ఆరోగ్యకరమైన చిరుతిండి.. రాత్రి పూట పండ్లు, లైట్ ఫుడ్ తీసుకోవడం మంచిదని అంటున్నారు.
అయితే గర్భిణులు ఆహారాన్ని ఎక్కువగా ద్రవరూపంలోనే తీసుకోవాలని చెబుతున్నారు. గర్భధారణ సమయంలో పిల్లలకు నీరు చాలా అవసరం. ఇక బిడ్డకు కావాల్సిన ఎనర్జీ కూడా ద్రవ రూపంలోనే చేరుతుందని అన్నారు. అంతేకాక.. ఒత్తిడిని తగ్గించుకునేందుకు తేలికపాటి యోగాసనాలు చేయాలని చెబుతున్నారు. అలా చేయడం ద్వారా గర్భిణులు  మానసిక ఒత్తిడి నుండి ఉపాశనమనం పొందుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: