అమ్మ: గర్భిణులు కుంకుమ పువ్వు తినటం మంచిదేనా..??

N.ANJI
గర్భధారణ సమయంలో మహిళలు పౌష్టికాహారం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గర్భధారణ సమయంలో కుంకుమ పువ్వు తప్పకుండా తీసుకుంటూ ఉంటారు. అయితే ప్రెగ్నెన్సీ సమయంలో కుంకుమ పువ్వును ఆహారంలో తీసుకోవడం వలన అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక కుంకుమ పువ్వును ప్రెగ్నెన్సీలో తొమ్మిది నెలల పాటు తీసుకుంటూ ఉంటారు. గర్భిణులు కుంకుమ పువ్వు
ఇది విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఆయుర్వేద ఔషధం. ఈ ఆయుర్వేద ఔషధాన్ని తీసుకోవడం వలన మన ఆరోగ్యానికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. గర్భవతిగా ఉన్నపుడు కుంకుమ పువ్వును తీసుకోవడం ఎంత మేలు చేస్తుందో డాక్టర్లు చాలా క్లియర్ గా వివరించారు. అవేంటో ఓ సారి చూద్దాం..
గర్భిణులుగా ఉన్నపుడు స్త్రీలు అనేక విషయాల గురించి ఆలోచిస్తూ వాటి గురించి తెలుసుకుంటూ ఉంటారు. అంతేకాదు.. అనేక రకాలుగా టెన్షన్ పడుతుంటారు గర్భిణులు. ఇక ఈ సమయంలో కుంకుమ పువ్వును తీసుకోవడం వలన మనసులో ఉన్న అలజడిని తొలగించి.. మానసిక ప్రశాంతత కలిగేలా చూసుకోవాలని అన్నారు. అలాగే మానసిక ప్రశాంతత అనేది ప్రెగ్నెన్సీ సమయంలో చాలా అవసరం అని అంటున్నారు.
గర్భధారణ సమయంలో మనసు అల్లకల్లోలం కావడానికి రకరకాల అంశాలు పని చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాక.. హార్మోన్లలో అనుకోని మార్పులు, కొన్ని రకాల శారీరక అసౌకర్యాలు కూడా మనసుని గాయపరుస్తాయని తెలిపారు. ఇక వీటి వలన మనసు చాలా అల్లకల్లోలంగా మారుతుందని అన్నారు. కాగా.. ఇటువంటి సమయంలో కుంకుమపువ్వును తీసుకోవడం వలన మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందని అన్నారు.
అయితే ఇలా మనసు అల్లకల్లోలంగా మారినపుడు స్త్రీలు చిన్న విషయాలకే అనవసరంగా చిరాకు పడడం, అనవసరంగా కోపానికి వస్తుంటారని అన్నారు. ఈ సమయంలో కుంకుమ పువ్వు చాలా బాగా పని చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. కుంకుమపువ్వు మనలో సెరోటోనిన్ను ఉత్పత్తి చేసి మన శరీరంలో రక్తప్రసరణను విస్తరిస్తుందని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: