బొట్టు వెనుక గల రహస్యం ఏంటంటే..??
ఎవరైనా మన ముఖాన్ని చూసినప్పుడు మొదటగా వారి ద్రుష్టి మన నుదిటి మీద పడుతుంది మీకు గుర్తు ఉందో లేదో నరుడు దృష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుంది. అలాగే ఎవరయినా మన ముఖాన్ని చూస్తే వారి చూపులో ఉన్నటువంటి నెగెటివ్ ఎనర్జీ మన కనుబొమ్మల మధ్యలో పడుతుంది. అలాగే మన శరీరంలో ఉండే నాడులలో కొన్ని సున్నితమైన నాడులు రెండు కనుబొమ్మలకు మధ్యభాగంలో కేంద్రీ కృతం అయి ఉంటాయి.
ఎప్పుడైతే నరుడు నయాకారాత్మకశక్తి కనుబొమ్మల మధ్యలో పడుతుందో అప్పుడు అక్కడ ఉన్నటువంటి సున్నితమైన నాడులు ఒత్తిడికి గురయి ఆ ప్రభావం మెదడుపై పడుతుంది. ఫలితంగా మెదడుకి ఒత్తిడి పెరిగే తలనొప్పి రావడం, చిరాకు రావడం వంటివి వస్తాయి.అందుకనే ఎదుటివారి కంటిచూపు నుండి మనల్ని మనం కాపాడుకోవాలంటే మనం మన కనుబొమ్మల మధ్య భాగంలో వాళ్ళ కంటి చూపు పడకుండా ఏదైనా అడ్డంగా పెట్టాలి. అది బొట్టయితే మరి మంచిది. అందుకే బొట్టు పెట్టాలని మన పూర్వికులు చెబుతూ ఉంటారు. బొట్టు పెట్టుకోవడం అనేది సంప్రదాయం ప్రకారమే కాకుండా సైన్స్ ప్రకారం కూడా ఇది నిరూపించడం జరిగింది. అందుకే బొట్టు పెట్టుకోవాలి అని పెద్దలు అంటూ ఉంటారు. సింధూరం పెట్టుకుంటే వచ్చే కళ మరేమి పెట్టుకున్న రాదు కదా.. !!