గురువు లేకుండా జిమ్నాస్టిక్స్ లో అద్భుతాలు సృష్టిస్తున్న బాలిక

Mamatha Reddy
జిమ్నాస్టిక్స్ లో రాణించాలంటే అపారమైన ప్రతిభ దానికి తగ్గ శిక్షణ ఇచ్చే గురువు ఉండాలి కానీ అవేవి లేకుండా ఓ యంగ్ లేడీ తన ప్రతిభను చాటుకుంది. యూట్యూబ్ లో జిమ్నాస్టిక్స్ వీడియోలు చూసి ఆసక్తి పెంచుకుని నేర్చుకొని దానిలో సత్తా చాటుతోంది. చాలా మంది యూట్యూబ్ లో వచ్చే వీడియోలు చూసి వదిలేస్తారు కానీ ఈమె చూసి నేర్చుకుని దానిలో ఎదగాలని నిశ్చయించుకుంది. కరోనా కారణంగా దాదాపు రెండు సంవత్సరాలుగా పాఠశాలలు మూతపడడంతో అందరూ ఇంటికే పరిమితమయ్యారు.

 ఎల్ అయితే తమ విలువైన కాలాన్ని పోగొట్టుకున్నారు. ఆన్ లైన్ క్లాసులు వినేసి స్మార్ట్ ఫోన్ లతో కాలక్షేపం చేస్తూ టీవీ చూస్తూ ఆ విలువైన సమయాన్ని వృధా చేసుకుంటున్నారు చాలామంది విద్యార్థులు. కానీ కేరళకు చెందిన ఎనిమిది సంవత్సరాల ఆండ్రియా మాత్రం ఇంట్లో ఖాళీగా ఉండ లేదు. తనకు దొరికిన ఈ విలువైన సమయాన్ని చక్కగా వినియోగించుకుని ఎవరూ లేకుండానే తనంతట తానుగా యూట్యూబ్ సహాయంతో జిమ్నాస్టిక్స్ నేర్చుకుంది. ఆమె అద్భుత విన్యాసాలకు అందరూ ఆశ్చర్యపోతున్నారు. 

మూడో తరగతి చదువుతున్న సమయంలో యూట్యూబ్ చూసి ఆసక్తి పెంచుకుంది. తరువాత తను కూడా అలా చేయాలని ప్రయత్నించింది. నెమ్మదినెమ్మదిగా తన శరీరాన్ని జిమ్నాస్టిక్స్ చేసేందుకు అనుకూలంగా మార్చుకుని ప్రస్తుతం ఎనిమిది రకాల సీట్లను అవలీలగా చేస్తుంది ఈ చిన్నారి. తల్లిదండ్రులు ఆండ్రియాను జిమ్నాస్టిక్స్ ఎందుకు అని అన్నారు కానీ వారు ఎప్పుడైతే తమకు  కూతురు లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించడం ప్రారంభించారో అప్పటినుంచి చిన్నారిని ప్రోత్సహిస్తున్నారు. ఫలితంగా స్టార్ చైల్డ్ జిమ్నాస్ట్ గా పేరు తెచ్చుకుంది. భవిష్యత్ లో ఎంతో మంది పిల్లలకు ఈమె ఓ స్ఫూర్తి గా నిలిచిందని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు.. ఖాలీ సమయాన్ని ఉపయోగించి ఇలా చేసింది అంటే నార్మల్ గా ఆమె ఇంకా ఎన్ని ఘనతలు సాధిస్తుందో అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: