కోవిడ్ త‌రువాత...

RATNA KISHORE
కోవిడ్ త‌రువాత...
ఇంట్లో ఉండే మ‌గువ‌లు
ఆఫీసు ప‌ని ఇంటి ప‌ని
ఒకేసారి చేసే మ‌గువ‌లు
ఆరోగ్యం కూడా ప‌ట్టించుకోని
మ‌గువ‌లు న‌గ‌రంలో ఉంటారు
బ‌స్తీల‌లో కూడా  
త‌మ‌ని తాము  ప‌ట్టించుకోని
త‌మ‌కు ఏమ‌యినా ఆస్ప్ర‌తికి పోని
మ‌హిళ‌లు ఉంటారు
ఎవ్వ‌యినా ఆరోగ్యం జాగ్ర‌త్త
క‌రోనా కార‌ణంగా స‌రైన తిండి - వేళ‌కు నిద్ర - ఒత్తిడి లేని జీవ‌నం ఇప్పుడు ఆశించ‌లేం. న‌గ‌రాల్లో ప‌నులు లేక వెల‌వెల‌బోతున్న బ‌స్తీలు ఎన్నో..పల్లెకు చేరుకున్నాక కూడా తిండి లేని జీవితాలు ఎన్నో! స‌రైన తిండి తిని దాదాపు ఏడాది కావస్తుంది వీళ్లంద‌రికీ ఈ త‌రుణంలో బ‌స్తీ జీవితం ఎలా ఉంటుంది.. ఎలా వీరి ఆరోగ్యం ఉంది అన్న‌ది హెల్పింగ్ హ్యాండ్ ఓ స‌ర్వే చేసింది. కొన్ని వివ‌రాలు రాబ‌ట్టింది. హైద్రాబాద్ కేంద్రంగా చేసిన ఈ స‌ర్వేలో ఎన్నో అనారోగ్య కార‌ణాలు వెల్ల‌డికి నోచుకున్నాయి. ముఖ్యంగా మ‌హిళ‌ల‌ను వేధించే ర‌క్త హీన‌త, అధిక బ‌రువు, ఇంకా రుతు స్రావ స‌మ‌స్య‌లు, మ‌ధుమేహం.. ఇంకా ఇంకొన్ని వెలుగులోకి వ‌చ్చాయి. క‌రోనా త‌రువాత  వీరిని వేధిస్తున్న స‌మ‌స్య‌ల‌ను ప్ర‌భుత్వం ప‌రిష్క‌రించాల్సి ఉంది.లేదంటే ఈ వ్యాధులే మ‌ర‌ణాల‌కు దారి తీస్తాయి. మొత్తం 3500 మందికి ప‌రీక్షలు చేయించిన ఈ సంస్థ అధిక ర‌క్త‌పోటుతో బాధ‌ప‌డుతున్న వారే అరవై శాతం మంది ఉన్నార‌ని తేల్చింది. పీసీఓఎస్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న వారు 75 శాతం ఉన్నార‌ని తేల్చారు. ఇలా ఈ స‌మ‌స్య‌ల‌కు వీరికి అందుబాటులో వైద్యం లేదు. మందులు లేవు. ఆరోగ్యం గురించి చెప్పే వారు లేరు. ఇవ‌న్నీ లేకుండా వీళ్లు ఎలా ఆరోగ్య‌వంతం అయిన స‌మాజానికి స‌హ‌క‌రించ‌గ‌ల‌రు అన్న‌ది ప్ర‌శ్న. ఈ కరోనా తిండీ నిద్ర‌నే కాదు ఇంకా మాన‌సిక ఆనందాన్నీ దూరం చేసి ద‌రిద్రం అంతా  నెత్తిన పెట్టింది. ముఖ్యంగా పోష‌కాహార స‌మ‌స్య‌లు ఇక‌పై మ‌రింత ఉద్ధృతం అయ్యే అవ‌కాశాలే ఎక్కువ. కానీ మ‌న‌కు ఓటు బ్యాంకు రాజ‌కీయం ముఖ్యం క‌నుక ఆ ప‌నిలోనే రాజ‌కీయ నాయ‌కులు ఉన్నంత కాలం వీరికి  ఆరోగ్య భ‌రోసా ద‌క్క‌డం అత్యాశ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: