కూలీ స్థాయి నుంచి స్కూల్ టీచర్ గా .. కష్టాలతో యువతి ప్రయాణం

Mamatha Reddy
కృషి ఉంటే ఎవరైనా ఎంతటి స్థాయికైనా వెళ్ళవచ్చు అనడానికి ఎంతో మంది గొప్ప గొప్ప వారి జీవితాలు ఉదాహరణలుగా మనకు చరిత్రలో ఉన్నాయి. అయితే చరిత్రలో ఉన్నవే కాకుండా చరిత్ర కు చేరని ఎందరో గొప్ప గొప్ప వ్యక్తుల జీవిత గాథలు మనకు తెలియనివి ఉన్నాయి. ఆ విధంగా కూలీ స్థాయి నుంచి స్కూల్ టీచర్ గా ఎదిగిన ఓ యువతి ప్రయాణం ఎంత గొప్పగా ఉందో ఇప్పుడు చూద్దాం. యాలకుల తోటలో దినసరి కూలీగా పని చేసే ఓ ఇరవై ఎనిమిది సంవత్సరాల యువతి ప్రభుత్వ ఉపాధ్యాయునిగా మారి ఎంతో మంది మహిళలకు స్ఫూర్తి కలిగిస్తుంది.

స్వయంకృషితో ఎదిగి ఇప్పుడు ఇంతటి స్థాయికి చేరిన  సెల్వమరి కి కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ అభినందనలు తెలిపారు. బాల్యంలో తల్లితో కలిసి యాలకుల తోటలో పని చేస్తూ అర్ధరాత్రులు నూనె దీపాన్ని పెట్టుకొని చదువుకునేది. చిన్నతనంలోనే తండ్రి కుటుంబాన్ని వదిలి వెళ్లిపోవడంతో తల్లి ఒంటరిగా ఇద్దరు కూతుళ్లను చూసుకుంది. దీంతో కుటుంబ పోషణకు తల్లితోపాటు తోటలో పని చేయడం తప్ప లేదు ఆమెకు.  తల్లితో రోజు కూలి పనులకు వెళ్లి డబ్బు సంపాదించి దాంతోనే పొట్ట నింపుకునేది.

పూటగడవని రోజులైనా చదువును మాత్రం పక్కన పెట్టలేదు. చదువు ఒక్కటే తమ జీవితాలను మారుస్తుందని నమ్మి  ఎవరికీ చెప్పకుండా తన కలను నిజం చేసుకోవడం మొదలుపెట్టింది. తన కల సాధించడానికి నిత్యం కృషి చేసింది. మొదటినుంచి గణితం ఇష్టం ఆమెకు.  తిరువనంతపురం డిగ్రీ కళాశాలలో చేరినప్పుడు తల్లికి ధైర్యం చెప్పి తాను చదువులో గొప్ప స్థాయికి వెళ్తానని చెప్పింది. కాలేజీ కి సెలవు రోజులు ఇవ్వగానే తిరిగి ఇంటికి వచ్చి కూలిపనులకు వెళ్లి తల్లికి చేదోడువాదోడుగా ఉండేది. ఆ విధంగా గా కుమిలి లోని ఎంజి యూనివర్సిటీ నుంచి బిఈడి పూర్తిచేసింది. తైక్వాడ్ గవర్నమెంట్ కాలేజ్ నుంచి ఎంపిల్ కూడా తెచ్చుకుంది. మ్యాథమెటిక్స్ లో పీహెచ్ఢీ ఇప్పుడు చేస్తుంది కేరళలోని ఇడుక్కి జిల్లాలో వంచి వయాల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా చేరింది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: