ఎదగాలని అనుకునేవారికి ఎదుగుతున్న వారికి అవమానాలు ఎప్పుడూ ఎదురవుతూనే ఉంటాయి. అలా అవమానాలను ఎదుర్కొంటేనే వారు పెద్ద స్థాయికి ఎదిగిగలరు. ఇప్పుడు అవమానాల పాలు అయిన వారే రేపు ఎదిగి తర్వాత వారిని అవమానాల పాలు చేసిన వారికి బుద్ధి చెప్తారు. వీరి అభివృద్ధి చూసి ఎంతో ఆశ్చర్య పోతూ ఉంటారు. అలా దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా టింబర్ డిపో యజమాని గా ఎదిగిన ప్రియా ఎన్నో అవమానాలను ఎదుర్కొని తిండి లేని పరిస్థితి నుంచి ఇప్పుడు పారిశ్రామిక వేత్త గా ఎదిగారు. ఆమె ఎదుగుదలను ఆమె పరిస్థితిని చూసి ఆనాడు చీ అమ్మవారే ఇప్పుడు ఆమె అభివృద్ధికి ఆశ్చర్యపోతున్నారు.
ప్రియా అడపా ఉద్యోగిగా చేరిన కంపెనీకే యజమాని అయ్యారు. కేవలం ఇరవై సంవత్సరాల లోనే ముళ్ళబాట ను పూలబాట గా మార్చుకున్నారు. ఇంటీరియర్ డెకరేషన్ ఫర్నిచర్ తయారీలో ముందడుగు వేస్తున్నారు ఇప్పుడు. ఎంతోమంది మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తూ ఉత్తమ ఎంటర్ ప్రీన్యూర్ గా లేడీ లెజెండ్ అవార్డును అందుకున్నారు. ఆమె తన జీవితంలో విజయం ఎలా సాధించిందో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.
మా తల్లిదండ్రులకు ఇద్దరు మగ పిల్లలు, ముగ్గురు ఆడ పిల్లలు. నేను మూడో అమ్మాయిని. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోవడంతో మా అమ్మమ్మ దగ్గర ఏలూరులో ఏడాదిపాటు పెరిగాం. అక్కడ ఎక్కువ కాలం ఉండడం ఇబ్బంది కావడంతో నా 13వ ఏట రెండు వేల రూపాయల ఉద్యోగానికి హైదరాబాద్ కు వచ్చాను. కొంతకాలానికి టింబర్ డిపో లో 5 వేల రూపాయల జీతం రిషపనిస్ట్ గా చేశాను. ఆ తరువాత అదే టింబర్ డిపో కు ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టాను. నా చదువు పూర్తి చేశాను. నా జీవితం లక్షకు చేరింది. ఆ తరువాత మా యజమాని విదేశాలకు వెళ్లి పోవాలని ఉద్దేశంతో కంపెనీ మూసెద్దాం అనుకున్న సమయంలో నేను ఆ కంపెనీని కొన్నాను. అంతకాలం నేను దాచుకున్న డబ్బుతో గుడ్ విల్ కింద 8 లక్షలు చెల్లించాను. ఆ తర్వాత నా స్నేహితుల సహకారంతో ఈ కంపెనీని ఇంతవరకు అభివృద్ధి చేసుకుంటూ వచ్చాను అని చెప్పింది.