ఓర్పుతో నేలపై బంగారం పండిస్తున్న మహిళా

Mamatha Reddy
మహిళా సాధికారత అంటే ఏంటో అక్షరాల చేసి చూపిస్తున్నారు ఓ గ్రామ మహిళలు. సేంద్రియ సాగుకు ఆ గ్రామం పెట్టింది పేరుగా నిలుస్తూ దేశంలోనే  మంచి పేరు తెచ్చుకునేలా ఆ గ్రామం లోని మహిళలు ఎంతో కృషి చేస్తున్నారు. అంతరించిపోతున్న మన పూర్వ కాలం నాటి జొన్నలు కొర్రలు సజ్జలు వంటి చిరుధాన్యాలను ఈ తరానికి అందజేసి వారి ఎదుగుదల కు తోడ్పడాల ని సదరు గ్రామం మహిళలు కంకణం కట్టుకొని పూర్వకాలంలో సేద్యపు విధానాలను అనుసరించి అంతరించిపోతున్న ఆ పంటలకు పునరుజ్జీవం పోస్తున్నారు మెదక్ జిల్లా జహీరాబాద్ ప్రాంతంలోని ఓ గ్రామంలో మహిళలు.

వీరి విజయం వెనుక డిడీఎస్ సంస్థ కృషి ఎంతో ఉందని, ప్రతి విషయంలో వారు తమకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు అని మహిళలు తెలుపుతున్నారు. సాగులో మాత్రమే కాకుండా సాంకేతికత వాడుకోవడంలో కూడా వీరు ముందున్నారు. అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంటూ పాత పంటల సాగులో విజయకేతనం ఎగురవేసిన ఈ మహిళలు నిజంగా ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు అని చెప్పవచ్చు.

తెలంగాణ రాష్ట్రంలోనే తక్కువ శాతం వర్షపాతం నమోదయ్యే మెదక్ జిల్లాలోని జహీరాబాద్ లో పంటలు పండిస్తూ సేద్యాన్ని ఓ పండగగా మారుస్తున్నారు. చిరుధాన్యా ల సాగు కొత్తపుంత లు తొక్కిస్తున్నారు. మహిళా సాధికార తే లక్ష్యంగా 1983 సంవత్సరంలో ఏర్పడిన డెక్కన్ డెవలప్మెంట్ ఇచ్చిన ప్రోత్సాహంతో చిరుధాన్యాల సాగు చేస్తూ మహిళలు విజయాలను సొంతం చేసుకుంటున్నారు. వీరిని ఆదర్శంగా తీసుకుని ఆ చుట్టుపక్కల గ్రామాల్లోని మహిళలు అలాగే చిరుధాన్యాలను చిరునవ్వుతో పండిస్తూ ముందుకెళుతున్నారు. నాలుగు దశాబ్దాల క్రితం బీడు భూముల దర్శనమిచ్చే జహీరాబాద్ ప్రాంతంలో ఇప్పుడు చిరుధాన్యాలను పండిస్తూ సహజ పద్ధతుల్లో సత్ఫలితాలను సాధిస్తూ పచ్చగా మార్చేస్తున్నారు. కూలీలుగా పని చేసుకునే మహిళలు ఇప్పుడు 75 సంఘాలుగా ఏర్పడి సహజ పద్ధతుల్లో తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: