హ్యాట్సాఫ్: వీల్ చైర్ నుంచి సమాజానికి సేవ చేస్తున్న యువతి

Mamatha Reddy
సమాజ సేవ చేయడానికి అంగవైకల్యం ఎవరికీ అడ్డు కాదు. ఎంతోమంది ఈ విధమైన లోపం ఉన్నవారు సమాజ సేవ చేస్తూ తమ టాలెంట్ ను నిరూపించుకుంటూ ప్రపంచానికి వారెంటో సత్తా చాటుతూ తమని తాము నిరూపించుకుంటున్నారు.  ఆ విధంగా ఓ మహిళ అంగవైకల్యంతో వీల్ చైర్ కి పరిమితం అయి సేవ చేస్తూ 30 మంది పిల్లలను అమ్మలా చూసుకుంటున్నారు. చిన్నతనం నుంచి అంగవైకల్యంతో బాధపడుతున్న ఇందిరను చైల్డ్ కేర్ హోమ్ లో చేర్చారు తల్లిదండ్రులు.

వారానికి ఒకసారి మాత్రమే ఇంటి నుంచి ఎవరో ఒకరు వచ్చి కలిసేవారు. పదే పదే చూడాలనిపించే ఆమె ఎన్నో ఇబ్బందులు పడింది. ఎంతో ఇష్టమైన తన వాళ్లకు దూరంగా ఉన్నప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా అనుభవించిన అలాంటి వాళ్లకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ప్రేమమ్ ఇల్లం అనే పేరుతో షెల్టర్ హోమ్ ను నడుపుతూ పిల్లలకు అమ్మ అయింది. ఐదేళ్ల వయస్సు ఉన్నప్పుడు పోలియో వచ్చి 90% వైకల్యానికి గురి అయ్యింది ఇందిరా. నడవడానికి కూడా రెండు కాళ్ళు సహకరించని ఆమె ఎప్పటికైనా ఏదో ఒక రోజు నేను నడవగలుగుతాను అన్న ధైర్యంతో ఉండేది. తల్లిదండ్రులు చెన్నై షెల్టర్ హోమ్ లో చేర్చారు. హోమ్ లో ఉన్న పిల్లలు బొమ్మలతో ఆడుకోవడం ఇష్టపడితే ఈమె మాత్రం చదువుకునేందుకు ఆసక్తి చూపించేది. 

షెల్టర్ హోమ్ లో సైకాలజిస్ట్ గా పనిచేస్తున్న సెల్విన్ అనే ఓ వ్యక్తి ఇందిర ఆసక్తిని గమనించి ఆమె తల్లిదండ్రులతో మాట్లాడి రోజు స్కూలుకు వెళ్లేందుకు ప్రోత్సహించాడు. ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఇందిరా ఉంటుందేమో నని తల్లిదండ్రులు భయపడి నప్పటికీ సెళ్విన్ అండదండలతో ధైర్యంగా ముందుకు సాగింది. చాలా వరకు స్కూల్ అడ్మిషన్ ఇవ్వడానికి వెనుకడుగు వేయగా ఒక స్కూలు ఎనిమిదో తరగతిలో చేరేందుకు అడ్మిషన్ ఇచ్చింది. స్కూల్లో చేరిన అనేక భయాలు ఆత్మన్యూనతా భావంతో కష్టపడి ఎస్.ఎస్.ఎల్.సి మంచి మార్కులతో పాస్ అయింది. ఇందిర లాంటి వారికి సేవ చేయాలన్న ఉద్దేశంతో ఈ వైకల్యం కలిగిన పిల్లలకు ఆసరాగా సెల్విన్ నిలుస్తున్నాడు. 1999లో మొదలైన ఈ షెల్టర్  హోమ్ విశేష సేవలు అందిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: