అమెరికా వెళ్లాలనుకున్నారు.. కరోనా సేవలు చేస్తూ సంచలనం..!!

Mamatha Reddy
డాక్టర్ ఇఫ్రాహ్ ఫాతిమా.. ఉస్మానియా హాస్పిటల్ లో ఎంబీబీఎస్ చేసింది. ఆమె స్నేహితురాలు డాక్టర్ మౌనిక వడియాల తను కూడా ఎంబిబిఎస్ పూర్తిచేసి పీజీ కోసం అమెరికా వెళ్లే ప్రయత్నంలో ఉంది. అప్పుడు వచ్చింది కరోనా.. ప్రపంచం మొత్తం బెంబేలెత్తిపోయింది. ఇంట్లో ఏ రకమైన లక్షణం వచ్చిన ఇది కరోనా లక్షణమేమో అని భయపడిపోయింది ప్రపంచం. మొదటి వేవ్ కంటే రెండో వేవ్ ఉధృతంగా ఉంది.  ఈ ఏడాది ఏప్రిల్ నాటికి పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఫ్యామిలీ డాక్టర్ ల క్లినిక్ లు, నర్సింగ్ హోమ్ లు  కిటకిటలాడిపోతున్నాయి. డాక్టర్ అపాయింట్మెంట్ దొరకక ఒక హాస్పిటల్ నుంచి మరొక హాస్పిటల్ కి పరుగులు తీస్తున్నారు ప్రజలు.
ఇలాంటి క్లిష్ట సమయంలో వీరిద్దరూ ప్రారంభించిన ఫ్రీ మెడికల్ సర్వీస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీళ్ళ పోస్ట్ లను ప్రముఖ రచయిత సల్మాన్ రష్డీ , బాలీవుడ్ నటి కొంకణ సేన్ లు  కూడా షేర్ చేశారు. దేశం నలుమూలల నుంచి ఫోన్ కాల్స్ రావడం మొదలైంది. దాంతో డాక్టర్ ల సంఖ్యను 24 నుంచి 50 కి మే 1 నాటికి 50 నుంచి 100 కు పెంచుకుంటూ పోయారు.ఒక్కో స్లాట్ లో ఎనిమిది మంది నుంచి 10 మంది డాక్టర్లు అందుబాటులో ఉండేలా చూసుకున్నారు. మొత్తంగా ఈ మెడికల్ సర్వీస్ నెట్వర్క్ లో దేశ విదేశాల్లో ఉన్న డాక్టరు మిత్రులందరికీ భాగస్వాములను చేయగలిగారు వీరిద్దరు.
అలాగే సర్వీస్ టైప్ కూడా ఉదయం 8 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు విస్తరించారు. కరోనా భయం శారీరక నుంచి మానసిక సమస్యలకు దారి తీయ డానికి గమనించి హైదరాబాద్ ఎర్రగడ్డ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ డాక్టర్లు కూడా ఈ మెడికల్ సర్వీస్ లో పాలుపంచుకున్నారు. ఇండియాలో ఉన్న తల్లిదండ్రుల కోసం జర్మనీ ఆస్ట్రేలియా దుబాయ్ లో ఉన్న వాళ్లు కూడా ఫోన్ చేస్తున్నారు. నిజంగా అవసరమైన టెస్ట్ లేవో అనవసరం అయిన టెస్ట్ లేవి  పేషంట్ లకు తెలియదు. కార్పొరేట్ హాస్పిటల్ సిబ్బంది ఒక లిస్టు ఇచ్చి ఈ పరీక్షలు చేయించుకుని రండి అని మాత్రమే చెబుతారు. అలాంటి పరిస్థితుల్లో ఈ ఇద్దరూ డాక్టర్లు చేస్తున్న మంచి పని మీద అ వైద్యరంగం గౌరవాన్ని పెంచుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: