అమ్మ: గర్భిణీలు అరటి పండు తినొచ్చా..?

N.ANJI
బిడ్డకు జన్మనివ్వాలని ప్రతిమహిళ ఎన్నో కలలు కంటూ ఉంటుంది. అయితే గర్భధారణ సమయంలో గర్భిణులు అనేక ఒత్తిళ్లకు గురవుతుంటారు. ఇక కొన్నిసార్లు గర్భిణులు ఎలాంటి ఆహారం తీసుకోవాలో అర్ధం కాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏది తినాలన్న మంచిదో కాదో ఆలోచించుకోవాలి. ఎందుకంటే తల్లి తీసుకునే ఆహారం పైనే బిడ్డ ఎదుగుదల ఆధారపడి ఉంటుంది. అందుకే ఇక గర్భిణీ మహిళలు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అయితే గర్భిణులు అరటి పండు తినడం మంచిదా.. కదా.. ఒక్కసారి చూద్దామా.
అయితే గర్భధారణ సమయంలో అరటిపండు తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అరటి పండులో క్యాల్షియం, పొటాషియం ఎక్కువ ఉండడం వల్ల వీటిని గర్భిణి మహిళలు తప్పకుండ తినాల్సిన పండ్లలో ఒకటి. ఈ సమయంలో చాలా మంది మహిళలు రక్తహీనత సమస్యతో బాధపడతారు. దీనిని నివారించాలంటే మీ డైట్ లో తప్పకుండ అరటిపండ్లను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఇక కడుపులో పెరిగే బిడ్డకు ఫోలిక్ యాసిడ్ చాలా అవసరం. ఇది బద్ద నాడీ వ్యవస్థకు, వెన్నెముక పెరుగుదలకు, బ్రెయిన్ పెరుగుదలకు చాలా అవసరం. అందుకే ఈ సమయంలో అరటిపండ్లను తప్పకుండ తినాలి. అంతేకాదు ఈ సమయంలో మలబద్దకం సమస్య వేధిస్తుంది. ఆ సమస్యలకు కూడా అరటిపండు తగ్గిస్తుంది. అరటిపండ్లలో ఉండే క్యాల్షియం లోపల బిడ్డ ఎముకలను బలంగా చేయడానికి సహాయపడతాయి.
అలాగే అరటిపండ్లలో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అరటిపండ్లు తినడం వల్ల దీనిలోని విటమిన్ బి6 బ్లడ్ సేల్స్ పెరగడానికి సహాయ పడతాయి. ఉదయం అలసటను అరటిపండ్లు దూరం చేస్తాయి. దీనిలోని పొటాషియం బ్లడ్ ప్రెజర్ ను నార్మల్ గా ఉంచుతుంది. అంతేకాదు ఆందోళన, స్ట్రెస్ వంటివి కూడా దరి చేరకుండా మిమ్మల్ని కాపాడుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: