అమ్మ: గర్భధారణ సమయంలో బ్లీడింగ్ సాధారణమేనా..?

N.ANJI
గర్భధారణ సమయంలో మహిళలు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ రకమైన బ్లీడింగ్ ను మీరు సులభంగా గుర్తించలేరు. ప్యాంటీ మీద స్పాట్స్ ను గమనించేవరకు లైట్ స్పాటింగ్ గురించి మీరు గమనించలేరు. దీని వలన ఎటువంటి ఇబ్బందీ తలెత్తదు. లేటు వయసులో గర్భం దాల్చిన మహిళల్లో ఈ పరిస్థితి ఎదురయ్యే అవకాశాలున్నాయి.
ఈ రకమైన బ్లీడింగ్ వలన ఎటువంటి బ్లడ్ లాస్ జరగదు. కాబట్టి, దీని వలన ఎటువంటి ఇబ్బందులూ తలెత్తవు. ఈ విషయంలో ఆందోళనకు గురవ్వాల్సిన అవసరం లేదు. కొంత రక్తంతో పాటు మ్యూకస్ డిశ్చార్జ్ అయితే : వైట్ డిశ్చార్జ్ కి సంబంధించిన విషయంలో తలెత్తే అసౌకర్యాలకు మహిళలు అందరూ అలవాటు పడే ఉండుంటారు.
అయితే కొన్ని సార్లు, గర్భం దాల్చని మహిళల్లో కూడా కొంత రెడ్డీష్ డిశ్చార్జ్ అనేది వైట్ మ్యూకస్ కి బదులు వెజీనా నుండి రావటాన్ని గమనించే ఉంటారు. అటువంటి సందర్భం గర్భం దాల్చిన తరువాత కూడా ఎదురైనా ఆందోళనకు గురవ్వాల్సిన అవసరం లేదు. ఇది సాధారణ విషయమే. ప్రతి ముగ్గురిలో ఒక మహిళ ఈ పరిస్థితిని ఎదుర్కొంటుంది. దీని వలన ఎటువంటి అసౌకర్యం తలెత్తదు.
ఒక షెడ్యూల్ ప్రకారం బ్లీడింగ్ జరిగి ఆ తరువాత కొన్ని రోజుల వరకు ఆగినట్లైతే: ఉదయం పూటే మీరు బ్లీడింగ్ ని గమనించగలుగుతున్నట్టయితే, అది కూడా ఫస్ట్ ట్రైమ్ స్టర్ లో ఈ పరిస్థితి ఎదురయితే, మీరు ఎటువంటి దిగులూ చెందనవసరం లేదు. మొదటి నెలలో ఎక్స్పీరియెన్స్ చేసే స్పాటింగ్ అనేది ఫెర్టిలైజడ్ ఎగ్ తనంతట తాను యుటెరస్ లైనింగ్ కు ఇంప్లాంట్ అవుతున్నప్పుడు ఏర్పడే స్పాటింగ్. ప్రెగ్నెన్సీ ప్రారంభ దశలో ఇలా జరుగుతుంది. దీనిని ఇంప్లాంటేడ్ బ్లీడింగ్ అనంటారు.
ఇక స్టాటిస్టిక్స్ ప్రకారం, దాదాపు 20 శాతం మంది గర్భిణీలు ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ ను ఎక్స్పీరియన్స్ చేస్తారు. దీనిలో దిగులు చెందవలసిన అవసరం లేదు. గర్భం దాల్చిన మొదటి నెల దాటగానే ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ తగ్గుతుంది. అయినా, స్పాటింగ్ అనేది కొన్ని రకాల ఇబ్బందులకు సూచికగా వ్యవహరిస్తోంది. ఈ విషయాన్ని మనం విస్మరించకూడదు.
గైనకాలజిస్ట్ ల అభిప్రాయం ప్రకారం.. బ్లీడింగ్ అనేది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీకి ఒక సూచిక. ఈ సందర్భంలో ఫెర్టిలైజ్డ్ ఎగ్ అనేది యుటెరస్ లైన్ కు ఇంప్లాంట్ అవకుండా ఫెలోపియన్ ట్యూబ్ ను ఎంచుకుంటుంది. అత్యంత తీవ్రమైన సందర్భాలలో, ప్రెగ్నెన్సీ సమయంలో బ్లీడింగ్ అనేది ఇన్ఫెక్షన్, ప్రీ టర్మ్ లేబర్, మిస్ క్యారేజ్ ను సూచిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: