
అమ్మ: కవల పిల్లలు కావాలంటే ఇలా చేయండి..?
ఇక వంశంలో ఇంతక ముందు కవలలు పుట్టివుంటే, మీ కూడా కవలలు పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వంశపారంపర్యంగా వచ్చే జీన్స్ కవలలు పుట్టడంలో, ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అందుకే ముందు మీ కుటుంబంలో ఇంతకముందు ఎవరైనా కవలలు ఉన్నారా? లేదా? చూసుకోండి. కొన్ని అధ్యయనాల ప్రకారం, మీకు ఎక్కువ పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకోవడం వలన, మీరు ఎక్కువ ఫెర్టైల్ అవుతారు. మీకు కవలలు పుట్టే అవకాశం పెరుగుతుంది. ఫోలిక్ ఆసిడ్ అధికంగా ఉండే ఆహారం తీసుకోండి. బీన్స్, సిట్రస్ ఫ్రూట్స్, ఆకు కూరలు లాంటి ఆహారాలు తీసుకోవడం వలన మీకు కావాల్సిన ఫోలిక్ యాసిడ్ అందుతుంది. మీకు కవలలు పుట్టే అవకాశం పెరుగుతుంది.
అయితే పాలలో ఉండే ప్రోటీన్స్, మీ శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి. దీని ద్వారా మీ గర్భస్త సమయంలో, శరీర వ్యవస్థలన్ని ఆరోగ్యంగా, సక్రమంగా నడుస్తాయి. కవలలు పుట్టడానికి ఇది చాలా అవసరం. బంగాళదుంపలు, చిలకడ దుంపలు, గనిసి గడ్డ,చామ దుంప లాంటి దుంప కూరలను, మీ ఆహారంలో భాగం చేసుకోండి. కవలలు పుట్టడానికి అవకాశం పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.