స్త్రీజాతికి స్ఫూర్తి రూపం "డాక్టర్ శ్రీజా రెడ్డి" ... !

VAMSI


మానవునిగా పుట్టినందుకు కష్ట సుఖాలు సహజం. అయితే కొంతమంది కష్టానికి లొంగిపోయి అనుకున్న పనులు సాధించకుండా వెనుతిరుగుతారు. మరి కొందరు కొంచెం కష్టమయినా పర్వాలేదు, ప్రయత్నించి విఫలమవుతారు. అయితే కొంతమంది కేవలం విజయం కోసమే పుడతారు. విజయం సాధించే వరకు నిద్రపోరు..వెనుతిరగరు. ఇలాంటి వారు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వారిలో ఒకరే ది గ్రేట్ డాక్టర్ సరిపల్లి శ్రీజా రెడ్డి గారు. కష్టం వచ్చినప్పుడు కుంగిపోవడం కాదు, దాంతో పోరాడి గెలవడానికి ఆత్మస్థైర్యం కావాలి. అంతకుమించిన ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుని, నిరాశ చెందకుండా ముందుకు సాగాలి అప్పుడే ఆ కష్టం నుండి బయటపడగలము. తన బిడ్డకు వచ్చిన కష్టాన్ని చూసి చలించిపోయిన ఓ తల్లి ఎన్నో హాస్పిటల్స్ చుట్టూ తిరిగింది ప్రయోజనం కనిపించలేదు. అయినా నిరాశ చెందకుండా తన బిడ్డను బాగు చేసుకోవాలన్న తపనతో ముందుకు సాగి విజయాన్ని సాధించింది.
అంతేకాదు ఇలాంటి కష్టం మరే తల్లికి రాకూడదని సంకల్పించింది. ఆ మహా మాతృమూర్తి శ్రజా రెడ్డి. తన బిడ్డకు వచ్చిన ఆటిజం అనే అరుదైన ఆరోగ్య సమస్య కారణంగా తను పడిన  మానసిక వేదన ఇంకే తల్లి పడకూడదన్న ఆలోచనతో ఆటిజం గురించి పరిశోధన చేసింది. పరిష్కారానికి వివరాలు సేకరించారు,  అంతేకాదు ఈ సమస్యకు ఫిజియోథెరపీ ప్రధానం అని తెలుసుకొని అందులో పట్టు సాధించి ఫిజియోథెరపీలో పట్టా అందుకుంది. 2017లో హైదరాబాద్ పినాకిల్ బ్లూమ్స్ అనే సంస్థను నెలకొల్పి ఆటిజంతో బాధపడుతున్న ఎంతో మంది చిన్నారులకు తన సంస్థ ద్వారా సేవలను అందిస్తున్నారు శ్రీజ. ఒక ఆంధ్రా లోనే కాకుండా, తెలంగాణ , కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు తన సంస్థను విస్తరించి ఫ్రీగా ఆటిజంతో బాధపడుతున్న పిల్లలకు చికిత్సను అందిస్తూ వారి తండ్రులకు అండగా నిలిచారు.
 
ఇప్పుడు మన దేశంలోనే కాక ఇతర దేశాలలోనూ పినాకిల్ బ్లూమ్స్  సంస్థను స్థాపించి ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి చిన్నారులకు సేవలందిస్తూ వారికి కొత్త జీవితాన్ని ఇస్తున్నారు. ఎంతోమంది తల్లిదండ్రుల పెదవిపై చిరునవ్వుకు కారణం అయ్యి ఆదర్శ మాతృమూర్తిగా కీర్తిప్రతిష్టలు సంపాదించుకున్నారు శ్రీజ రెడ్డి. మనకున్న ఆస్తులను ఎలా పెంచుకోవాలి అనుకునే ఈ రోజుల్లో... తన సొంత ఆస్తులను సైతం ఆటిజం చిన్నారుల వైద్యానికి  ఖర్చు చేస్తూ ఎన్నో కుటుంబాలకు కనిపించే దేవతగా మారారు ఆదర్శ మాతృమూర్తి శ్రీజ. ఇలాంటి సేవా భావంతో మరెంతోమంది మహిళలకు స్ఫూర్తికావాలని కోరుకుందాం. ఈ రోజు పుట్టినరోజును జరుపుకున్న శ్రీజా రెడ్డి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆశిస్తున్నాము.  

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: