ఇండియా అత్త‌.. కెన‌డా కోడ‌లు.. దిమ్మ తిరిగిపోయే స్టోరీ .. !!

Mamatha Reddy
ఈ రోజుల్లో అత్తా కోడళ్ళ మధ్య అనుబంధం ఎలా ఉంది అంటే గతంలోలా కొట్టుకోవడం, తిట్టుకోవడం కాకుండా ఫ్రెండ్లీ నేచర్ లో ఉండే విధంగానే ఉంటుందని చెప్పొచ్చు.. కాలం మారుతున్న కొద్దీ , వాళ్ళ ప్రవర్తన కూడా మారుతూ మానవసంబంధాల పై , కుటుంబ సంబంధాల పై మరింత గౌరవం పెరిగే లా వ్యవహరిస్తున్నారు.. ఇప్పుడు చెప్పబోయే కోడలి కథ మనందరికీ కనువిప్పు కలిగిస్తుంది.. కెనడా లో పుట్టి పెరిగిన కోడలు, ఇండియాలో కట్టుబాట్ల మధ్య ఉన్న అత్త మధ్య కుదిరిన అనుబంధం గురించి ఆమె మాటల్లోనే విందాం..
ఉదయాన్నే లేవాలనే ఆత్రుతతో రాత్రంతా నిద్ర పట్టలేదు.. టెన్షన్ గా ఉంది.. ఈ ఆలోచలన్ని రేపు నేను కలవాల్సిన ఒక వ్యక్తి గురించి.. ఎన్నో టెన్షన్ల తో నైట్ లేటుగా పడుకున్న నేను ఉదయం కూడా లేట్ గా లేచాను.. దాంతో తనని కలిసే టైం దాటిపోయింది.. దాంతో హడావిడిగా రెడీ అయ్యాను అద్దంలో చూసుకుంటే మోడ్రన్ డ్రెస్ వేసుకున్నాను దాన్ని యాక్సెప్ట్ చేస్తారు లేదో అన్న భయం కలిగింది.. కానీ చీర కట్టే వారు ఎవరు.. ఇలా మనసులో ఎన్నో ఆలోచనలు..ఇంతకీ నేను కావాల్సిన వ్యక్తి ఎవరా అనుకుంటున్నారా ఎవరో కాదు నాకు కాబోయే అత్తగారు..
ఎట్టకేలకు అమ్మని కలిశాను భయంభయంగా నేను మాట్లాడటం స్టార్ట్ చేశాను కానీ ఆమెతో మాట్లాడిన రెండు నిమిషాల్లోనే నా భయాన్ని పోగొట్టాడు ఆవిడ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫోటో 20 ఏళ్ల కిందటి ఫోటోనే.. మాది కెనెడా... మా హబ్బిది ఇండియా.. వర్క్ ప్లేస్ లో ప్రేమలో పడ్డాము.. కుటుంబాలకు చెప్పి రెండు వారాల్లో ఒప్పించి పెళ్లి చేసుకున్నాం.. ఈ ఇరవై ఏళ్లలో  పొజిషన్స్, పరిస్థితి ఎన్నో మారిన మారనిది అత్తా కోడళ్ళ మధ్య ఉన్న ప్రేమ.. నా జీవితంలో మా అత్తయ్య లాంటి ధైర్యం , చిరునవ్వు, ఉన్నతమైన భావాలు ఉన్న వ్యక్తిని నేను ఇంతవరకు చూడలేదు.. నా ముఖం పై చిరునవ్వు ఉన్నంతవరకు ఆవిడ మాతోనే ఉంటారు అని చెప్పింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: