అమ్మ: వేసవిలో గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..!

N.ANJI
గర్భధారణ సమయంలో మహిళలు అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇక వేసవిలో గర్భిణులు అనేక ఆరోగ్య సమస్యలకు గురవుతుంటారు.వాటి నుండి ఉపశమనం పొందటానికి ఈ చిట్కాలు పాటించండి. గర్భిణులు కనీసం రోజులో మూడు లీటర్లు నీళ్లు తాగండి. లేదా లేతగా ఉండే కొబ్బరి నీళ్లు తాజాగా చేసిన జ్యూసులను తీసుకోవచ్చు.
ఒకవేళ కనుక మీకు డయాబెటిస్ ఉంటే వీటిని తీసుకోవద్దు లేదా తక్కువ పంచదార వేసుకుని తీసుకోండి. మీరు సరిగ్గా సరిపడా నీళ్లు తాగారు అంటే మీకు హీట్ స్ట్రోక్ లాంటివి ఉండవు. పైగా మీరు డీహైడ్రేషన్ కి గురవకుండా ఉండొచ్చు. కాబట్టి రోజులో తప్పకుండా ఎక్కువ ఫ్లూయిడ్స్ తీసుకోవడానికి ప్రయత్నించండి.
అంతేకాదు.. రోజు చేసే రొటీన్ ఎక్ససైజ్ ని ప్రతీ రోజు ఉదయం కానీ సాయంత్రం పూట కానీ చేయొచ్చు ఎప్పుడైతే టెంపరేచర్ తక్కువ ఉంటుందో ఆ సమయం లో చేయండి అదే మంచిది. ఎందుకంటే ఎండ లో కష్టపడి పోతే నీరసం వస్తుంది. అలానే చల్లబడిన తర్వాత స్విమ్మింగ్ కూడా చేయొచ్చు ఇది కూడా నిజంగా మంచి ప్రయోజనం మీకు ఇస్తుంది.
అయితే కాళ్లను ఎత్తులో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు కుర్చీ లో కూర్చున్నప్పుడు బల్లని కానీ లేదా దిండు ని కానీ ఉపయోగించండి. ఎత్తులో మీ పాదాలుని పెట్టడం వల్ల పాదాల్లో చేరే వాటర్ తగ్గిపోతుంది. వేసవిలో టైట్ ఫిట్ లేదా సిల్కు బట్టలు ధరించడం మంచిది కాదు వీలైనంత వదులుగా ఉన్న బట్టలు ధరించడం, కాటన్ వాటిని ధరించడం, లైట్ కలర్స్ ని వేసుకోవడం చేయండి, అలానే చెప్పులు కూడా కంఫర్ట్ గా ఉన్న వాటిని ధరించండి. వీటి వల్ల స్పెల్లింగ్ అవకుండా ఉంటుంది.
ఇక మంచి సన్ గ్లాసెస్ ని కొనుక్కోవడం, సన్ స్క్రీన్ ని రాసుకోవడం ఎక్కువ సేపు సన్ స్క్రీన్ ఉండేలా చూసుకోవడం, బయటికి వెళితే గొడుగు లేదా టోపీ ధరించడం వంటివి చేయాలి. దీని వల్ల ఈ ఎండకి మీరు తట్టుకోగలరు. కనీసం మధ్యాహ్నం పూట అరగంట సేపు పడుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే మధ్యాహ్నం పూట ఎండ ఎక్కువగా ఉంటుంది. అటువంటి సమయం లో మీరు చక్కగా నిద్ర పోవడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: