చూసింది.. చేరదీసింది.. ఆ కుర్రాడిని మార్చేసింది..!!
ఆస్థి పంజరం లాంటి శరీరం ఉన్న ఓ చిన్నారి బాలుడికి ఓ మహిళా నీళ్లు పడుతున్న ఈ దృశ్యం హృదయ విదారకమైన ఈ సంఘటన అందరిని కదిలించింది.. అందరు విచ్చారం వ్యక్తం చేసినా ఆ బాలుడికి సహాయం చేయడానికి ఎవరు ముందుకు రాలేదు. బాలుడికి నీళ్లు తాగిస్తూ, బిస్కెట్లు తినిపిస్తూ ఆ ఫొటోలో కనిపించింది మహిళ.. ఆమె చేసిన పనికి గొప్ప గొప్ప వారు అభినందించారు.. అయితే ఐదు సంవత్సరాల తర్వాత ఆ బాలుడు ఎలా ఉన్నాడో చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోక మానదు.
ఈ ఫోటో లో ఉన్న ఆమె పేరు అంజా రింగ్రెన్ లొవెన్. ఆమె భర్త పేరు డేవిడ్ ఎమ్మాన్యుయెల్ ఉమెమ్. సామజిక కార్యకర్తలైన వీరు అనాథ పిల్లల కోసం ఆఫ్రికన్ చిల్డ్రన్స్ ఎయిడ్ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్‌మెంట్ ఫౌండేషన్ ని ఏర్పాటు చేసి అనాధలకు హెల్ప్ చేస్తున్నారు.. అలా నైజీరియా లో ఈ బాలుడిని చూసి చలించిపోయి వెంటనే అతనికి నీళ్లు, ఆహారం అందజేశారు. తర్వాత ఆ బాలుడిని తమ శరణాలయంలో చేర్పించి పెంచారు. ఈ క్రమంలోనే ఆ బాలుడు ఇప్పుడు అందరు పిల్లల్లాగే ఎదిగి ముద్దుగా కనిపిస్తున్నాడు. ఇదంతా ఆ దంపతుల చలవే. ఇంకా కొంతమంది ని కూడా ఇలాగే చదివిస్తూ వారు మంచి పేరు సంపాదిస్తున్నారు.