అమ్మ: గర్భిణులు లవంగాలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు..?!

N.ANJI
గర్భవతిగా ఉన్నప్పుడు మహిళలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తినే తిండి, ఆహారపు నియమాలు, వ్యాయామం విషయంలో ప్రత్యేక శ్రద్ధను వహించాలి. పోషకాలతో నిండిన ఆహారాన్ని తీసుకోవడంతోపాటు ఆరోగ్యాన్ని చురుగ్గా ఉంచే కొన్ని రకాల మసాల దినుసులను తీసుకోవాలి. అయితే వీటిలో లవంగాలు గర్భిణుల ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూర్చుతాయి. లవంగాలలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. అందుకే తరచూ వీటిని ఉపయోగించి వంటలు వండుతారు. గర్భిణులు లవంగాలను తీసుకోవడం వల్ల గుండె, కిడ్నీలు, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు తొలుగుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

గర్భవతిగా ఉన్నప్పుడు స్త్రీలకు తరచూ వాంతులు, అజీర్తి, కడుపులో మంట, వికారం, పుల్లటి త్రేన్పులు వస్తుంటాయి. ఆ సమయంలో తలనొప్పి, చిరాకు వంటి సమస్యలు వస్తుంటాయి. అలాంటి సమయంలో లవంగాలను నోటిలో వేసుకుంటే కొంతవరకు ఉపశమనం కలుగుతుందని వైద్యులు సూచిస్తున్నారు. రోజు పరిగడుపున ఏడు లవంగాలను తీసుకుని, వాటిని పొడి చేసుకోవాలి. ఒక బౌల్‌లో నీటిని తీసుకుని వేడి చేసుకోవాలి. అందులో లవంగాల పొడిని వేసుకుని, రుచికి సరిపడా బెల్లం వేసుకుని తాగాలి. అలా చేస్తే వాంతులు, వికారం వంటి సమస్యలు తగ్గుతాయి. శరీరం కూడా తేలికగా అవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

గర్భిణిగా ఉన్న సమయంలో శరీరంలో నీటి శాతం ఎక్కువ అవుతున్నట్లు అనిపిస్తుంది. కాళ్లు, ముఖం ఉబ్బినట్లు ఉంటాయి. అలాంటి సమయంలో లవంగాలతో కషాయం చేసుకుంటే.. వాపు తగ్గుతుంది. గర్భిణుల ఉన్నప్పుడు స్త్రీలు తరచూ మూత్ర విసర్జనకు వెళ్తుంటారు. ఈ సమస్య ఎక్కువగా ఉంటే లవంగాల కషాయం తయారు చేసుకుని తాగాలి. దీంతో అతి మూత్ర సమస్యను కూడా నిరోధించవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే రోజూ పౌష్టికాహారాన్ని తీసుకోవాలని, ఫ్రూట్స్, డ్రైఫ్రూట్స్ తీసుకోవాలని వారు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: