మొదటి భర్త అలా.. రెండో భర్త ఇలా...చివరికి ఈ మహిళా కూతురితో..!!

Mamatha Reddy
బాల్య వివాహాలు మన సమాజానికి కొత్తేమి కాదు.. ఎన్ని సార్లు చెప్పిన కొంతమంది మూర్ఖులు బాల్య వివాహాలు చేసి ఎంతో మంది ఆడవారి జీవితాలని బలి చేస్తున్నారు.. పోషించే శక్తి లేక, కట్నం ఇచ్చే సత్తువ లేక ఇష్టం వచ్చినట్లు ఆడపిల్లలని కని వారి జీవితాన్ని నరకం చేస్తున్నారు వీరు. ఓ మహిళ జీవితంలో అత్యంత నరక ప్రాయమైన భాగాన్ని పంచుకుంది. 11 ఏళ్ల వయసులో ఆ నలభై ఏళ్ల వ్యక్తి ఆమెకు పెళ్లి చేశాక ఆమె జీవితం ఎంతటి నరకమయమైందో ఆమె ద్వారానే తెలుసుకుందాం..

11 ఏళ్ల వయసులో ఓ నలభై ఏళ్ల వ్యక్తికి ఇచ్చి నాకు పెళ్లి చేశారు. కారణం నా తల్లి తండ్రుల పేదరికం.. నా కన్యత్వాన్ని రక్తమోడేలా చేశానని అతడిలో చిన్న గర్వం. భరించలేని నొప్పిని పంటికింద దాచుకుని ఎంతో వ్యధ అనుభవించాను. ఆ రోజునుంచి ప్రతి రోజు నాకు కాళరాత్రే.. మౌనంగా అన్నీ భరించాను.. ఇదే అనుకుంటే మూడు నెలల తర్వాత నాకు ఇంకో రకమైన టార్చర్ మొదలైంది.. నాకు పిల్లలు పుట్టలేదని అత్తవారి దగ్గరినుంచి వేధింపులు మొదలయ్యాయి.. అత్తింట్లోని అందరి నుంచి తల ఓ చెయ్యి నాపై వేసేవారు.. ఓ రోజు న భర్త నన్ను ఇంట్లోని తరిమేశాడు..

దాంతో మా నాన్న అప్పు చేసి మరీ నాకు రెండో పెళ్లి చేశాడు.. వాడు కూడా మొదటి భార్యకి విడాకులిచ్చినా వాడే.. ఆడపిల్ల పుట్టిందని మొదటి భార్య కు విడాకులిచ్చాడు.. రెండో భర్త అయినా మంచి వాడు దొరుకుతాడు అనుకుంటే వాడు కూడా కామంతో నన్ను చిత్ర వధ చేసేవాడు.. మొదటి భర్త ఎలా ఉండేవాడు అని గుచ్చి గుచ్చి అడిగి పాత గాయాన్ని రేపేవాడు. నేను గర్భవతి ని అయ్యాను.. ఆడబిడ్డకు జన్మనిచ్చాను. కనీసం పాపను చూడకుండానే నీకు విడాకులు ఇచ్చేస్తున్నాను అని కబురు పంపాడు. ఇప్పుడు ఎవరి మీద ఆధారపడకుండా నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను..నా కూతురుని కూడా అలాగే పెంచుతాను. అమ్మాయిగా పుట్టాం శాపం అనుకునేవారికి వరం అనేలా పెంచుతాను. అందుకే ఎంతటి బాధనైనా నా కూతురు కోసం నవ్వూతూ భరిస్తున్నా అని చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: