ప్లాస్టిక్ బాటిల్స్ తో నిర్మించిన టాయిలెట్..చిత్రమైనా.. భలేవుందే..!!

frame ప్లాస్టిక్ బాటిల్స్ తో నిర్మించిన టాయిలెట్..చిత్రమైనా.. భలేవుందే..!!

Mamatha Reddy
భారతదేశం ఎంత అభివృద్ధి చెందుతున్న దేశమేఅయినా టాయిలెట్స్ విషయం లో వెనకపడి ఉంది అని చెప్పొచ్చు.. ఎందుకంటే ఇప్పటి కీ కొన్ని గ్రామంలో టాయిలెట్స్ లేవు.. బహిరంగంగానే వారు ఈ కాలకృత్యాలను తీర్చుకుంటున్నారు. ప్రభుత్వ వైఫల్యమే, ప్రజలకు ఇంట్రెస్ట్ లేకనో కానీ వారికి మరుగుదొడ్లు ఏర్పాటు చేయడం లో మాత్రం అందరు ఫెయిల్ అయ్యారు.. కొన్ని గ్రామాలలో ఈ టాయిలెట్ సదుపాయం లేక మహిళలు ఎంత ఇబ్బంది పడుతున్నారో అందరికి తెలిసిందే.
ఈనేపథ్యంలో టాయిలెట్స్ కట్టడం లో ఓ సరికొత్త పద్ధతి ని ప్రవేశ పెట్టాడు ఓ ఐఏఎస్ ఆఫీసర్.. అయన ఇచ్చిన ఐడియా కి అందరు హ్యాట్స్ ఆఫ్ అంటున్నారు. ప్లాస్టిక్ బాటిళ్ల తో మరుగుదొడ్డిని నిర్మించి అందరికి ఆదర్శంగా నిలిచాడు.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఎనిమిదివేల ప్లాస్టిక్ బాటిల్స్ ని ఉపయోగించి ఈ టాయిలెట్ ను నిర్మించాడు. దీనికి సంబందించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా తెగ వైరాలు అవుతున్నాయి.. మంచి ఐడియా, వెరైటీ ఐడియా అంటూ కామెంట్స్ కూడా వెల్లువెత్తుతున్నాయి..
2014 బ్యాచ్ కి చెందిన ఐఏఎస్ ఆఫీసర్ అయిన డిప్యూటీ కమిషనర్ లక్ష్మి ప్రియా ఈ వినూత్నమైన ఆలోచన కి శ్రీకారం చుట్టింది . ఈ ప్రాజెక్టును పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ విభాగం  ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శాంతను సూత్రధర్ చేపట్టారు. ఈ విషయమై శాంతను ది బెటర్ ఇండియా తో మాట్లాడుతూ..ఇలా నిర్మించడం కష్టమేమీ కాదు .. మేము వ్యర్థాలుగా విసిరివేయబడ్డ ప్లాస్టిక్ సీసాలన్నిటిని సేకరించి ప్రతి సీసా లో ఇసుక సిమెంట్ తో పాటు పుట్టి మరియు మోర్టార్ నింపి గట్టిపడిన తర్వాత ఈ మరుగుదొడ్డిని నిర్మించాము.. ఇటుకల బదులు దీన్ని వాదము ..ఇది మంచి ధృడంగా ఉంది.. ప్రస్తుతం ఇంకో టాయిలెట్ నిర్మించే పనిలో ఉన్నాం.. అన్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: