"ఆంధ్రా కింగ్ తాలుకా" ఫస్ట్ డే కలెక్షన్స్: రామ్ కెరియర్ లోనే హైయెస్ట్ రికార్డ్..మొత్తం ఎన్ని కోట్లు అంటే..!

Thota Jaya Madhuri
ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా, యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ గురువారం గ్రాండ్‌గా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మహేశ్ బాబు. పి దర్శకత్వం వహించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి సంయుక్తంగా నిర్మించారు. రామ్ కెరీర్‌లో 22వ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన ఈ సినిమా విడుదల రోజునే మంచి హైప్‌ను క్రియేట్‌ చేసింది. ఫుల్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమా ప్రత్యేకంగా ఫస్ట్ డే కలెక్షన్స్ విషయానికి వస్తే… ఆంధ్రాలో సినిమా మంచి వేగంతో దూసుకెళ్లింది.



గుంటూరు – రూ. 10 లక్షల షేర్

తూర్పు గోదావరి – రూ. 11 లక్షలు

కృష్ణా – రూ. 20 లక్షల గ్రాస్

పశ్చిమ గోదావరి – రూ. 16.20 లక్షలు

ఉత్తరాంధ్ర – రూ. 30 లక్షల షేర్

ఈ సంఖ్యలు చూస్తుంటే రామ్ సినిమాలకు ఆ ప్రాంతంలో ఉన్న బలమైన మార్కెట్ మళ్లీ రుజువైంది. కంటెంట్‌పై నమ్మకంతో దర్శకుడు మహేశ్ పి స్వయంగా విశాఖ రైట్స్ కొనుగోలు చేయడం విశేషం. అలాగే హీరో రామ్ నైజాం తో పాటు గుంటూరు రైట్స్ తీసుకోవడం కూడా ఈ సినిమాపై ఉన్న వారి నమ్మకాన్ని స్పష్టంగా చూపిస్తుంది. అంతేకాదు  ఓవర్సీస్‌లో అద్భుతమైన స్పందన లభించింది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో డయ్-1 కలెక్షన్ $275ఖ్, ఇది రామ్ పోతినేని కెరీర్‌లో ఇప్పటి వరకు వచ్చిన హయ్యెస్ట్ ఓపెనింగ్గా రికార్డ్ సృష్టించింది.



సినిమా ఫస్ట్ డే వరల్డ్ వైడ్‌గా సుమారు రూ. 7.5 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. గురువారం వర్కింగ్ డే అయినప్పటికీ ఇంత మంచి ఓపెనింగ్ రావడం నిర్మాతల్లో, అభిమానుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. మౌత్ టాక్ పాజిటివ్‌గా ఉండటం వల్ల వీకెండ్‌లో మరింత భారీ వసూళ్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికి, ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ రామ్ కెరీర్‌లోనే అత్యధిక ఫస్ట్ డే రికార్డును అందుకున్న సినిమాగా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: