భాగ్యశ్రీ తల తిక్కల పని..అడ్దంగా ఆడేసుకుంటున్న నెటిజన్లు..వీడియో వైరల్..!
ఇప్పుడే తాజాగా భగ్యశ్రీ షేర్ చేసిన వీడియో మాత్రం అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో హాట్ టాపిక్‌గా మారింది. అమెరికాలో వీళ్ళిద్దరూ ఒకే కారులో ప్రయాణిస్తున్న వీడియోను భగ్యశ్రీ స్వయంగా షూట్ చేసి షేర్ చేయడం ఆన్‌లైన్‌లో వేగంతో వైరల్ అవుతోంది. థియేటర్లలో వీరిద్దరూ కలిసి నటించిన "ఆంధ్ర కింగ్ తాలుకా" సినిమా భారీ విజయాన్ని అందుకుంటూ సాగుతుండటంతో, ఈ ఇద్దరి హాట్ కెమిస్ట్రీ గురించి చర్చలు మరింత బలపడుతున్నాయి. భాగ్యశ్రీకి ఇది మొదటి సూపర్ హిట్ కావడం, రామ్‌కీ కూడా ఇటీవల కాలంలో అందని సక్సెస్ ఈ సినిమా ద్వారా రావడం—ఫ్యాన్స్‌లో ఆనందాన్ని పెంచడమే కాకుండా, వీళ్ళిద్దరి మధ్య ‘స్పార్క్’ ఉన్నట్టే ఉందని అనిపిస్తోంది. ఈసందర్భంగా ఓవర్‌గా క్లోజ్‌గా కనిపిస్తున్న ఫోటోలు, వీడియోలు అభిమానుల్లో కొత్త డౌట్లు వేస్తున్నాయి.
తాజా వీడియోలో భగ్యశ్రీ కెమెరా పట్టుకుని రికార్డ్ చేస్తుండగా, పక్కనే రామ్ కూలింగ్ గ్లాసెస్ వేసుకుని చాలా స్టైలిష్‌గా కనిపించాడు. ఇదే నెటిజన్లకు హాట్ టాపిక్ అయ్యింది. కొంతమంది నెటిజన్లు ఘాటుగా స్పందిస్తూ— “ఇంకెన్ని రోజులు దాచుకుంటారు? మీ ఇద్దరూ ప్రేమలో ఉన్నారనేది స్పష్టమే.”..“పెళ్లి చేసుకోబోతున్నారంటే చెప్పేయండి, ఇలా దాచిపెట్టడానికి ఏముంది?” అంటూ ప్రశ్నిస్తున్నారు. మరికొందరు మరింత మొండిగా, నాటిగా కామెంట్లు చేస్తూ//“మీరు ఇప్పటికే నిశ్చితార్థం చేసుకున్నట్టు అనిపిస్తోంది.”
“ఏమీ లేనప్పుడు ఒకే కారులో టూర్ ఎందుకు?”..“ఫ్రెండ్స్ అంటారా? ఇది ఫ్రెండ్షిప్ లా కనిపించడం లేదు.” అంటూ పలువిధాలుగా రియాక్ట్ అవుతున్నారు.
అంతేకాదు, కొంతమంది మాత్రం ఈ వీడియోనే ‘ఓవర్ యాక్టింగ్’గా అభివర్ణిస్తున్నారు. “ఎందుకు ఇలా రెచ్చగొట్టే వీడియోలు షేర్ చేస్తారు? తర్వాత రూమర్లు వస్తే బాధపడతారు.”..“నిజంగా ఏమీ లేకపోతే, ఇలాంటి కంటెంట్ ఇవ్వడానికి అవసరం లేదు.”
అంటూ వారి అసహనాన్ని వ్యక్తపరుస్తున్నారు. కొందరు మరింత ఘాటుగా విమర్శిస్తూ—“భాగ్యశ్రీ ఇలా వీడియోలు షేర్ చేయడం ఆమె కెరీర్‌కే నష్టంగా మారే పని.” “ఫామ్‌లోకి వస్తున్న సమయంలో ఇలాంటి కాంట్రవర్సీ ఎందుకు?”
అంటూ కామెంట్లు చేస్తున్నారు.