అమ్మ: గర్భంలోని శిశువు ఎక్కువగా కదిలితే అమ్మాయా..!?

N.ANJI
ప్రతి మహిళ బిడ్డకు జన్మనివ్వాలని ఎన్నో కలలు కంటుంది. గర్భం దాల్చిన మొదటి నుండి ప్రసవం అయ్యే వరకు చాల జాగ్రత్తగా ఉండాలి. అయితే సాధారణంగా గర్భవతుల విషయంలో ఎన్నో నమ్మకాలను మనం వింటూ ఉంటాము. అందులో ఒకటే, తల్లి గర్భంలో కదలికలు ఎక్కువగా ఉంటే అమ్మాయి పుట్టబోతుంది అని అంటూ ఉంటారు. ప్రస్తుతం మనం ఆధునిక యుగంలో ఉన్నాం కాబట్టి శిశువు యొక్క లింగ నిర్దారణ చెయ్యడానికి యంత్రాలు ఉన్నాయి. ఈ కారణం చేస్తనే నేటి తరం వారు ఈ నమ్మకాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. అలాగే నేటి తరంలో సాంప్రదాయిక విషయాలు చాలా మందికి రుచించడం లేదు.
ఇక అప్పటిలో గర్భిణీ స్త్రీలు చాలా వదులుగా ఉండే బట్టలనే ధరించేవారు. అందులోనూ ముఖ్యంగా కాటన్ చేరాలకే ప్రాధాన్యం ఇచ్చేవారు. ఇలా గర్భిణీ స్త్రీలు శరీరాన్ని వదులుగా ఉంచినట్లు అయితే మన పూర్వికులు గర్భంలోని శిశువు యొక్క లింగాన్ని, గర్భం యొక్క కదలికలను బట్టి చెప్పేసేవారు. ఇది వినడానికి కొంచెం వింతగా ఉన్నప్పటికీ ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం లేని ఆ రోజులలో ఇలానే తల్లి గర్భంలోని శిశువు యొక్క లింగ నిర్దారణ చేసేవారు. అందులో నిజం ఉంది కాబట్టే ఆ నమ్మకం తరం తరువాత తరానికి చేరింది. అయితే ఈ విధమయిన శిశువు లింగ నిర్దారణ చాలా ఎక్కువ సార్లు నిజం అని నిరూపితమైంది.
అయితే ఇంకొక విషయం ఏమిటంటే ఈ పరిశీలన పద్ధతి విషయంలోని వాస్తవాన్ని నేటి వైద్య శాస్త్రం కూడా అంగీకరించింది. తల్లి గర్భం లో ఉన్నప్పుడు ఆడ శిశువు గుండె మగ శిశువు గుండె కంటే ఎక్కువ సార్లు కొట్టుకుంటుంది. దీన్ని  ఆధారం  చేసుకునే అప్పటిలో మన బామ్మలు గర్భంలో ఉన్న శిశువు  ఆడా లేక మగా అనేది నిర్దారించేవారు. ఇటువంటి ఎన్నో ఆశ్చర్యకరమైన విశ్వాసాలు మన సనాతన సంప్రదాయంలో ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: