అమ్మాయిని ప్రేమిస్తున్న అంటూ దైర్యంగా చెప్పిన ద్యుతి చంద్..ఈమె గురించి తెలిస్తే హ్యాట్సాఫ్ అంటారు

Mamatha Reddy
ద్యుతి చంద్ జీవితం చాలా ఆసక్తికరమైనది. దేశంలో అందరి జీవితం ఒకటైతే ద్యుతి చంద్ వాళ్లందరికంటే విభిన్నమైనది. ఇలా ఎందుకు చెబుతున్నానో ముందు ముందు మీకే తెలుస్తుంది.
ద్యుతి చంద్ ఒడిశా రాష్ట్రానికి చెందిన అమ్మాయి మరియు భారత అథ్లెటిక్. ఈమె భారతదేశం తరపున పరుగు పోటీలో పాల్గొంటూ ఎన్నో పతకాలను సాధించింది. అలాగే ప్రపంచ యూనివర్సిటీ క్రీడల్లో స్వర్ణ పతకాన్ని అందుకున్న తొలి క్రీడాకారిణిగా ద్యుతి చంద్ నిలిచింది. మరియు టైమ్స్ పత్రికలో కూడా చోటు సంపాదించి భారత మేటి క్రీడాకారిణిగా ఘనతని సాధించింది. ఇవి ఆమె సాధించిన విజయాలు.
ఇక ఆమె జీవితం అందరికంటే విభిన్నమైనది చెప్పడం జరిగింది ఎందుకంటే ఆమె ఒక అమ్మాయితో సహజీవనం చేస్తుంది. మీరు విన్నది నిజమే దేశంలోనే మొదటిసారి నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని ధైర్యంగా చెప్పడం ఒక్క ద్యుతి చంద్ కి సాధ్యం అయ్యింది. అయితే మన దేశం కూడా ఈ తరపు ప్రేమలను(లెస్బియన్) కూడా చట్టబద్దం చేసింది. ఈ క్రమంలో నిర్మొహమాటంగా అందరిముంది తాను ఒక అమ్మాయిని ప్రేమించిన విషయాన్నీ బయట పెట్టింది. స్వలింగ బంధానికి నాంది పలికిన తొలి క్రీడాకారిణిగా ద్యుతి చంద్ నిలిచిందని  చెప్పవచ్చు
తన బంధం గురించి ఇంట్లో వాళ్ళకి చెప్పిన మొదటగా అందరు విని ఆశ్చర్యపోయారు. ఎవరు విషయాన్నీ స్వీకరించలేకపోయారు. ఆమెతోనే జీవితాంతం ఉండాలని చెప్పిన కూడా ఎవ్వరు తన మాటలని పట్టించుకోలేదు. ద్యుతి స్వలింగ బంధం గురించి  విమర్శలను ఎదురుకోక తప్పలేదు, కొందరు విమర్శిస్తూనే ఆలా బహిరంగంగా చెప్పే ధైర్యం చేసినందుకు గాను ద్యుతిని పలువురు అభినందిస్తున్నారు. అయితే ద్యుతి ప్రేమించింది తన స్నేహితురాలిని. ఈ బంధం గురించి సమాజం ఎన్ని మాటలు అన్న కూడా తాను అవేమి పట్టించుకోలేదు. వాటినన్నింటిని తట్టుకొని నిలబడే ధైరం ద్యుతి లో కొండంత ఉంది కాబట్టే అన్ని తెగించే తన బంధం గురించి బయట పెట్టగలిగింది. చూసారు కదా ధృతి చంద్ విభిన్న జీవిత కథ.
ప్రేమించడానికి ఆడా, మగా అనే తేడా లేదని ద్యుతి చంద్ జీవిత కథతో మనకి అర్థం అయ్యింది. ఇక తన అథ్లెటిక్ కెరీర్ ను ఇలాగే కొనసాగిస్తూ, ఒలంపిక్ లక్ష్యంగా సాధన చేస్తూ ముందు ప్రయాణం సాగిస్తుంది ద్యుతి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: