అమ్మ: గర్భిణులు కొర్రలు తినడం వలన కలిగే ప్రయోజనాలెన్నో తెలుసా..!?

N.ANJI
గర్భధారణ సమయంలో మహిళలు చాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. గర్భిణులు తీసుకునే ఆహారంపైనే  బిడ్డ ఎదుగుదల ఉంటుంది. అయితే గర్భధారణ సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలియక చాల మంది ఇబ్బందులు పడుతుంటారు. అయితే గర్భధారణ సమయంలో మహిళలు చిరుధాన్యాలు తినొచ్చా. ఇక అందులోను గర్భిణులు కొర్రలు తినడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటో ఒక్కసారి చూద్దామా.

ఇక ఊబకాయంతో బాధపడేవారు వీటిని అన్నంలా వండుకుని తినడం వల్ల సమస్య అదుపులోకి వస్తుంది. అయితే మంచి బలవర్దకమైన ఈ ఆహారంపై ప్రతిఒక్కరికీ అవగాహన పెరిగింది. దీనివల్ల చాలామంది కొర్రలతో వంటచేసేందుకు ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా.. చిన్నారులు, గర్భిణీలకు ఇది మంచి బలవర్ధకమైన ఆహారం అని చెప్పొచ్చు. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల ద్వారా ఉద సంబంధ వ్యాధులు, గుండెసమస్యలు, కీళ్లవాతం, రక్తస్రావం వంటి సమస్యలకు దూరంగా ఉండొచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

అయితే కొర్రలలో కార్బోహైడ్రేట్స్‌తో పాటు పీచు పదార్థం చాలా ఎక్కువగా ఉండడం వలన ఇవి శరీరంలోని చక్కెర స్థాయిలను తక్కువగా విడుదలయ్యేలా చేస్తాయి. వీటిని తరచుగా తీసుకోవడం వలన డయోబెటిస్ వంటి వ్యాధులను నియంత్రించవచ్చును. అంతేకాకుండా ఈ కొర్రలు జీర్ణవ్యవస్థకు చక్కగా దోహదపడుతాయి.
 
ఇక కొర్రలలో గల అమైనో యాసిడ్స్ దెబ్బతిన్న కణాలను నయంచేసేందుకు సహాయపడుతాయి. గర్భిణీ మహిళలు వీటిని తరచుగా తీసుకోవడం కడుపులో  శిశువు ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. అదే సమయంలో పాలిచ్చే తల్లులకు పాలు పడేలా చేస్తాయి.  కొర్రలలో బి1, బి2, బి5, బి6 వంటి విటమిన్స్ అధికంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు వెల్లడించారు.
 
అంతేకాక కొర్రలలో గల పొటాషియం రక్తపోటును నియంత్రించేందుకు సహాయపడుతుంది. వీటిల్లో గల మెగ్నిషియం, ఐరన్, జింక్ వంటి ఖనిజాల వలన జుట్టు ఒత్తుగా పెరడమే కాకుండా చర్మం సౌందర్యానికి కూడా ఉపయోగపడుతాయి. శరీరంలోని కొవ్వును తగ్గించుటకు దోహదపడుతాయి. కొర్రలలో పాస్పరస్ ఎముకల బలాన్ని పెంచుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: