అమ్మ: గర్భిణులు తప్పకుండా పాటించవలిసిన జాగ్రత్తలు ఇవే..!?

N.ANJI
బిడ్డకు జన్మనివ్వడం అనేది ప్రతి మహిళా కోరిక. గర్భధారణ సమయంలో మహిళలు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అయితే గర్భధారణ సమయంలో స్త్రీలకు వాసన గుర్తించే సామర్థ్యంపెరుగుతుంది. ఈస్ట్రోజెన్ ఉత్పత్తి పెరగడం వలన తక్కువగా ఉండే వాసన కూడా వీరికి  ఘాటుగా అనిపిస్తుంది. ఘాటు వాసనలతో ఇబ్బంది కలిగిన సమయంలో టిష్యూ లేదా హ్యాండ్ కర్చీఫ్ వాసన చూడడం వలన సమస్య తగ్గుతుంది. గర్భధారణ సమయంలో చాలామంది స్త్రీలు పొట్టలో గ్యాస్ సమస్యతో బాధ పడుతుంటారు. కాబట్టి గ్యాస్  సమస్యను  తెచ్చి పెట్టే ఆహారంను తినకపోవడం మంచిది.
డైరీ ప్రోడక్ట్స్,కార్బనేటడ్ బేవరేజెస్, క్రూసిఫెరస్ వెజిటబుల్స్, వెల్లులి, పాలకూర, బంగాళాదుంప, బీన్స్ అలాగే హై ఫైబర్ఉండే ఆహారం ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది. ఒకే సారి పెద్దమొత్తంలో ఆహారం తినకూడదు. కొంచెం కొంచెంగా ఎక్కువ సార్లు తీసుకోవడం మంచిది. గర్భధారణ సమయంలో హార్మోన్ల మార్పు వలన దట్టమైన, పొడవైన అలాగే నల్లని వెంట్రుకలు పెరుగుతాయి. ముఖం, ఛాతి , పొత్తికడుపు వంటి భాగాల  పైన జుట్టు దట్టంగా పెరుగుతుంది. ఈ సమస్య నుండి  సురక్షితంగా బయట పడాలంటే  ట్వీజ్, వ్యాక్స్ అలాగే షేవ్ చేసుకోవాలి. బ్లీచెస్ అలాగే డెపిలేటరీస్ వంటి రసాయనాలను వాడకూడదు.
ఎక్కువగా మూత్రానికి  వెళ్లడం అనేది బిడ్డకు జన్మనిచ్చేవరకు కొనసాగుతుంది. బాత్రూంకు వెళ్లాల్సిన అవసరం వచ్చినప్పుడు ఆపుకోకూడదు. అదే సమయంలో కాఫీ, టీ అలాగే కొన్ని కార్బనేటడ్ డ్రింక్స్ ను తాగకూడదు. అలా తాగడం వలన తరచూ బాత్రూం కు వెళ్లాల్సిన అవసరాన్ని కలిగిస్తాయి.చాలామంది గర్భిణీలకు జ్ఞాపకశక్తి సమస్యలు వస్తాయి. దీన్నే బేబీ బ్రెయిన్ అంటారు. చిన్న చిన్న విషయాలను కూడా మరచిపోతూ ఉంటారు. వస్తువులను ఎక్కడ పెట్టారో కూడా గుర్తుండదు. దీనికి గల కారణం నిపుణులు కూడా అంచనా వేయలేకపోతున్నారు.
కానీ, గర్భధారణలో తలెత్తే హార్మోనల మార్పు, నిద్రలేమి అలాగే ఒత్తిడి వంటి సమస్యకు దారితీస్తున్నాయని చెప్పవచ్చు. ఈ సమస్య కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. గర్భధారణ సమయంలో డీహైడ్రేషన్ కూడా నోట్లోని సెలైవా లెవెల్స్ పై ప్రభావం చూపుతాయి.నోరు పొడిబారడానికి కారణమవుతాయి. అందువల్ల బాక్టీరియా పెరిగి దుర్వాసన వస్తుంది.గర్భధారణ సమయంలో క్రమం తప్పకుండా చెకప్ తో పాటు నోటి శుభ్రత కు ప్రాధాన్యం ఇవ్వడం వలన ఈ సమస్య నుండి బయట పడవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: