అమ్మ : గర్భిణీ స్త్రీ కొబ్బరి నీళ్లు తాగడం మంచిదేనా.. !!

Suma Kallamadi
గర్భిణీ స్త్రీలకు కడుపులో బిడ్డ పెరుగుతున్న విషయం చాలా సంతోషాన్ని ఇచ్చే వార్త. కడుపులో బిడ్డను తలుచుకుని ఎంతో మురిసిపోతుంది ఆ తల్లి. అయితే గర్భవతిగా ఉన్నప్పుడు  మహిళలు అన్ని సమయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఏమాత్రం చిన్న అజాగ్రత్తగా ఉన్నాగాని అది పుట్టబోయే బిడ్డపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. గర్భిణీ స్త్రీ  ఇప్పటివరకు ఉన్న  కొన్ని అలవాట్లను మానుకోవాలి. అలాగే కొత్త వాటిని వారి ఆహారంలో చేర్చాలి. వీటిలో ఒకటి నీటి వినియోగం. గర్భవతి కాకముందే కాఫీ,టీ, కూల్ డ్రింక్స్ వంటి పానీయాలు తాగడం బాగా అలవాటుగా ఉండవచ్చు కానీ మీరు గర్భం దాల్చిన తరువాత  ఆ అలవాట్లను మార్చుకోవాలి. పాలు తాగడం అలవాటు చేసుకోవాలి. అలాగే కొబ్బరినీరు తాగడం కూడా తప్పనిసరి అనే మానసిక స్థితికి రావలసి ఉంటుంది. కొబ్బరినీళ్ళు ఒక సహజ పానీయం అయినప్పటికీ గర్భధారణ సమయంలో ఎంతో మేలు చేస్తాయి.

కొబ్బరి నీరులో పొటాషియం, మెగ్నీషియం లాంటి  అనేక ఇతర ఖనిజాలు ఉన్నాయి.. ఇవి మానవ శరీరం నుండి విషపూరిత అంశాలను తొలగిస్తాయి. కాబట్టి కొబ్బరి నీరు తాగడం వల్ల మూత్రవిసర్జన అనుభూతి చెందుతారు. కానీ గర్భిణీల కొబ్బరి నీరు పరిమితంగా తీసుకోవాలి.గర్భిణీ స్త్రీలు గర్భధారణ సమయంలో తమకు ఎలక్ట్రోలైట్స్ అవసరం  సాధారణంగా గర్భధారణ సమయంలో, మహిళలందరూ ఉదయం వికారం, వాంతుల  సమయంలో  వారి శరీరంలో ముందుగా ఉన్న ఎలక్ట్రోలైట్ల పరిమాణం గణనీయంగా తగ్గుతుంది.అందుకనే ఎలక్ట్రోలైట్ల ఉన్న కొబ్బరినీళ్లు తాగాలి.  ఖనిజాలు, సోడియం, కాల్షియం, పొటాషియం మరియు భాస్వరం గర్భిణీ స్త్రీకి శరీర బలాన్ని,  శక్తిని ఇస్తాయి.

 అలాగే రోజంతా ఆమెను శక్తివంతం చేస్తాయి. గర్భిణీ స్త్రీలకు కావల్సిన ఎలక్ట్రోలైట్స్ అందించడానికి కొబ్బరి నీరు తప్పనిసరిగా త్రాగాలి, ఇవి శరీరం యొక్క పిహెచ్ స్థాయిని అలాగే రక్తపోటును నియంత్రిస్తాయి.గర్భధారణ సమయంలో, శరీరంలో చాలా హార్మోన్లు మారుతాయి. గుండెల్లో మంట, మలబద్ధకం,  అజీర్ణం ఉన్న మహిళలకు ఇది సాధారణ సమస్య. కాబట్టి గర్భిణీ స్త్రీలకు ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు అవసరం. గర్భిణీ స్త్రీలు గర్భం యొక్క చివరి మూడు నెలల్లో ప్రసవ బాధాకరమైన కాలాన్ని అనుభవిస్తారు, ఇది సహజంగా రక్తపోటును పెంచుతుంది. అలాగే చక్కెర అధికంగా ఉండే ఆహారాలు, పానీయాలను త్రాగవద్దు. కొబ్బరి నీరు సహజంగా చాలా తక్కువ చక్కెర పదార్థాన్ని కలిగి ఉంటుంది కాబట్టి నిరభ్యన్తరంగా కొబ్బరి నీళ్లు తాగవచ్చు. గర్భధారణ సమయంలో అధికంగా చెమట పట్టడం వల్ల శరీరం డీహైడ్రేషన్ కు గురి అవుతుంది. అప్పుడు మీరు నీటికి బదులుగా కొబ్బరి నీరు త్రాగవచ్చు.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: