అమ్మ : గర్భిణీ స్త్రీ బార్లీ నీళ్లు తాగడం మంచిదేనా..??
బార్లీ వాటర్ రెగ్యులర్ గా తాగడం వల్ల శరీరానికి కావల్సిన క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, పొటాషియంలు అందుతాయి. ఇవి మీకు అలాగే మీ బిడ్డకు ఎంతో ఆరోగ్యకరం.. !! బార్లీ వాటర్ లో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మలబద్దకం , హెమరాయిడ్స్ వంటి గర్బధారణ సమయంలో వచ్చే సీరియస్ మెడికల్ కండీషన్స్ ను నివారిస్తుంది. నియాసిన్ బ్లడ్ క్లాట్స్ ను నివారిస్తుంది. దాంతో ప్రసవం సురక్షితం అవుతుంది. బార్లీ వాటర్ లో డ్యూరియాటిక్ లక్షణాలు అధికంగా ఉండటం వల్ల యూరినేషన్ రేట్ ను పెంచుతుంది. దాంతో గర్బిణీ స్త్రీ శరీరంలో ఎక్కువ నీరు చేరకుండా , కాళ్ళు వాపులు రాకుండా చేస్తుంది. గర్భిణీగా ఉన్నపుడు శరీరంలో అధిక నీరు చేరుతుంది. ఆ నీరు పోవాలంటే బార్లీ నీరు తాగాలి. అందువల్ల బార్లీని నీళ్ళల్లో నాన్నబెట్టి రోజూ తాగితే మంచిది.
బార్లీని రవ్వలాగా, మెత్తటి పిండిలా చేసి దానితో చేసిన ఆహార పదార్దాలను తింటే త్వరగా, తేలిగ్గా జీర్ణమవుతాయి. బార్లీ నుండి తీయబడిన నూనెను వాడితే శరీరంలోని కొలెస్టరాల్ శాతం తగ్గుతుంది. బార్లీలో ఉండే గ్లిసమిక్ ఇండెక్స్ బ్లడ్ షుగర్ లెవల్స్ ను మెయింటైన్ చేయడానికి , గర్భధారణ సమయంలో వచ్చే జస్టేషనల్ డాయబెటిస్ ను దూరం చేయడానికి సహాయపడుతుంది. బార్లీని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల పొట్టలో ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. శరీరం నుండి వ్యర్థాలను ఫ్లష్ అవుట్ చేస్తుంది. అన్ని రకాల ఇన్ఫెక్షన్స్ నుండి మిమ్మల్ని మీ బిడ్డని సురక్షితంగా రక్షిస్తుంది.