ఆడవాళ్ళలో ఇమ్మ్యూనిటిని పెంచే ఈ మూడు పదార్ధాల గురించి తప్పక తెలుసుకోండి.. !!

Suma Kallamadi
ఆడవాళ్లు ఇంటిపనులలో పడి వాళ్ళ ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయడం లేదు. ఒక పక్క ఇంటి పని, మరో పక్క ఆఫీస్ వర్క్ తో ఉరుకుల పరుగులతో బిజీ లైఫ్ ను గడిపేస్తున్నారు.మామూలుగానే ఆడవాళ్ళకి ఇమ్మ్యూనిటి శక్తి అనేది తక్కువగా ఉంటుంది. ఈ  వ్యాదినోరోధక శక్తి ఎప్పుడయితే తగ్గుతుందో అప్పుడే అనేక రకాల వ్యాధులు చుట్టుముడతాయి అసలే కరోనా కాలం. ఒక పక్కవాతావరణంలో మార్పులు. అందుకనే ఈ  వెదర్ లో ఆడవాళ్ల  హెల్త్ గురించి ఎంతో జాగ్రత్త తీసుకోవాలి. ఇమ్యూనిటీ ఏం మాత్రం తగ్గినా ఇన్‌ఫెక్షన్స్ దాడి చేస్తాయి. ఎందుకంటే, ఈ సీజన్ లో మన బాడీ చాలా వీక్ గా ఉంటుంది. జలుబు, దగ్గు, జ్వరం వంటి అంటువ్యాదులు పట్టుకుని పీడించే కాలం ఇది. అందుకే ఆడవాళ్లు ఆరోగ్యకరమైన సమతులాహారం, రెగ్యులర్ ఎక్సర్సైజ్, కొన్ని లైఫ్ స్టైల్ ఛేంజెస్… ఇవి ఆడవాళ్ళని స్ట్రాంగ్ గా చేస్తాయి. పైగా, మన వంటిళ్ళలోనే ఇందుకు కావాల్సిన దినుసులన్నీ కూడా ఉంటాయి. ఇవే చాలు ఇన్‌ఫెక్షన్స్ ని దరి చేరకుండా చూస్తాయి.


ఈ దినుసులని మీరు ఫుడ్ లో యాడ్ చేసినా పరవాలేదు, లేదా ఇలా ఒక కషాయం లా తయారు చేసినా పరవాలేదు.ఇంట్లో మహిళలు ఈ ఎనర్జీ బూస్ట్ తాగుతూ ఇంట్లో మీ కుటుంభ సభ్యులతో కూడా తాగించండి.ఈ కషాయం పేరే వామూ, మిరియాల కషాయం.వాము, మిరియాలు – రెండింటిలోనూ ప్రమాదకరమైన ఫ్రీ రాడికల్స్ తో పోరాడే యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉన్నాయి. అంతే కాక మిరియాల్లో ఉన్న విటమిన్ సీ, యాంటీ-ఇంఫ్లమేటరీ ప్రాపర్టీస్ వలన దగ్గు, జలుబు తో వచ్చే లక్షణాలకి చెక్ పెట్టవచ్చు. ముక్కు దిబ్బడ తగ్గించి గొంతులో గరగరని పోయేలా చేస్తుంది. వాము, ఇండైజెషన్ కీ, బ్లోటింగ్ కీ మంచి మందు. ఈ రెండూ కలిపి చేసే ఈ కషాయం ఈ సీజన్ లో ఎంతో అవసరం. అంతే కాక ఈ డ్రింక్ లో కొద్దిగా అల్లం కూడా కలుపుతాం. అల్లం వల్ల వచ్చే ప్రయోజనాలు అందరికీ తెలిసినవే.


ఈ కాషాయం కోసం ఒక అరంగుళం – అల్లం ముక్కఒక టీ స్పూన్  మిరియాల పొడి,ఒక టీ స్పూన్ వాము, అల్లం ఉంటే చాలు.ముదుగా ఒక గిన్నెలో ఒక కప్పు నీరు తీసుకుని అందులో వాము, మిరియాల పొడి, అల్లం వేసి మూడు నిమిషాలు మరిగించండి.తర్వాత వడకట్టి, కావాలనుకుంటే కొద్దిగా తేనె కలుపుకుని ఒక గ్లాస్ లోకి తీసుకోండి. దీన్ని అప్పుడే తాగేయవచ్చు, లేదా కొంచెం కొంచెం రోజంతా తాగవచ్చు.అంతేకాదు ఈ కాషాయం తాగడం వల్ల ఆడవాళ్లు సహజంగా బరువు కూడా తగ్గుతారు...


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: