ఆడవాళ్ళ అందాన్ని పెంచుకోవడానికి సహజ సిద్దమైన ఇంటి చిట్కాలు... !!

Suma Kallamadi
ఆడవాళ్లు అందంగా కనిపించాడని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. అలాగే ముఖానికి మార్కెట్లో దొరికే క్రీమ్స్ రాస్తూ ఉంటారు. నిజానికి ఇలాంటి క్రీమ్స్ లో కెమికల్స్ కలుపుతారు.అవి తాత్కాలికంగా మి ముఖాన్ని అందంగా ఉంచిన గాని తర్వాత భవిష్యత్తులో చర్మం మీద ప్రభావం చూపుతాయి. అందుకనే కొన్ని సహజ సిద్దమైన ఇంటి చిట్కాలు పాటించడం వల్ల మీ ముఖం కాంతితో మెరిసిపోతుంది. అవేంటో చుడండి.. !!మీ ముఖం కాంతితో మెరవాలంటే తులసి ఆకుల గుజ్జును నిద్రకు ముందు ముఖానికి పట్టించి ఉదయం లేవగానే చన్నీటితో కడిగితే ముఖం కాంతి వంతం అవుతుంది.

అలాగే మొటిమలతో ఇబ్బంది పడే ఆడవాళ్ళు తాజా పెరుగులో కొద్దిగా శనగపిండి కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని తర్వాత చన్నీటితో కడిగితే ఎంతటి మొండి మొటిమలైనా మాయమవుతాయి.అలాగే వేధించే మొండి మొటిమలకు పండిన టమాటా లేదా వెల్లుల్లి లేదా పుదీనా రసం రాసి బాగా ఆరిన తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగితే మొటిమలు మాయం కావాల్సిందే.అంతేకాదు ముఖం మీద ముడతలు, నల్లని మచ్చలతో ఇబ్బంది పడేవారు బొప్పాయిపండు గుజ్జుని కళ్ళకి తగలకుండా ముడతలు, మచ్చల మీద రాసి అరగంట తర్వాత చల్లని నీటితో కడిగితే ముడతలు,నల్ల మచ్చలు తొలగి పోయి చర్మం కాంతి వంతంంగా ఉంటుంది.


పచ్చి శనగపప్పు రాత్రంతా పాలల్లో నానబెట్టి ఉదయం రుబ్బి అందులో చిటికెడు పసుపు కలిపి ముఖానికి రాసి ఆరిన తర్వాత మంచినీటితో కడిగితే ముఖం కాంతి వంతమవుతుంది.అర టీ స్పూన్‌ నిమ్మరసంలో కొద్దిగా గంధం తీసుకుని పేస్ట్ లాగా కలుపుకోవాలి. ఇందులో బొప్పాయి గుజ్జుని కలపాలి. వేళ్లతో ఈ మిశ్రమాన్ని తీసుకుని ముఖంపై వలయాకారంలో సుతిమెత్తగా మర్దనా చేయాలి. ఇది స్క్రబ్‌లా ఉపయోగపడడమే కాకుండా, చర్మకాంతిని కూడా మెరుగు పరుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: