మొటిమలు,మచ్చలు లేని చర్మం మీ సొంతం అవ్వాలంటే గంధంతో ఇలా చేయండి

Suma Kallamadi
ఆడవాళ్ళకి గంధం చేసే మేలు అంతా ఇంతా కాదు. ఆడవాళ్ళు పూజలలో, శుభకార్యాలలో గంధం ఎక్కువగా ఉపయోగిస్తారు. ఎవరినైనా గౌరవించటానికి గంధం రాయటం మన సంప్రదాయంలో భాగం.  గంధం దుర్గంధాన్ని పోగొడుతుంది. రక్త దోషాన్ని, పైత్యాన్ని తగ్గిస్తుంది. అలాగే ఆడవాళ్ళు  వేసవికాలంలో గంధాన్ని అరగదీసి కళ్ళమీద రాసు కుంటే కళ్ళ ఎరుపులు మంట తగ్గుతాయి. చల్లదనాన్ని కలిగిస్తుంది.అలాగే మనం  స్నానం చేసే నీళ్ళలో గంధం నూనె అయిదారు చుక్కలు వేసుకుని స్నానం చేస్తే చర్మవ్యాధులు రావు. శరీరం తాజాగా ఉంటుంది.అలాగే శరీరం నుంచి వచ్చే దుర్వాసన కూడా తొలగిపోతుంది.  అంతే కాదు  చందనాన్ని ఆయుర్వేద వైద్యంలో విరివిగా ఉపయోగిస్తారు.



చందనంతో తయారైన సోపులు, పౌడర్లు వాడితే చర్మానికి మంచిది. వేడిచేసి చర్మం మీద కురుపులు వస్తే గంధం అరగ దీసి రాస్తే కురుపులు తగ్గిపోతాయి.అలాగే ఆడవాళ్ళు మంచి గంధం అరగదీసి రోజూ రెండుసార్లు ముఖానికి రాసుకుంటే మొటిమలు పోతాయి. చందనాది తైలం వల్ల తలనొప్పి, కళ్ళ మంటలు తగ్గుతాయి.గంధం యాంటీసెప్టిక్‌లా పనిచేస్తుంది. ఆడవాళ్ళ చర్మం మృదువుగా మారాలంటే  నూనె ఆలివ్‌ ఆయిల్‌లో కలిపిన గంధాన్ని శరీరానికి మసాజ్‌ చేస్తే చర్మం మృదువుగా, మెత్తగా  ఉంటుంది.




అలాగే మొటిమలు, మచ్చలతో ఇబ్బంది పడే ఆడవాళ్లు ఇలా చేయండి.  గంధం పొడి లేదా.. మిశ్రమానికి టీ స్పూన్ పాలు లేదా టీ స్పూన్ రోజ్ వాటర్.. మరో టీ స్పూన్ పసుపు కలపాలి. పసుపు యాంటీ సెప్టిక్ లా పనిచేస్తుంది. పాలు మాయిశ్చరైజర్ లా పనిచేస్తుంది. రోజ్ వాటర్ చర్మాన్ని ఫ్రెష్ గా ఉంచుతుంది.మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల పాటు బాగా ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ ని వారానికి ఒకసారి ముఖానికి రాసుకోండి.  ఫలితం మీకే తెలుస్తుంది. మొటిమలు, మచ్చలు తగ్గడానికి ఈ  గంధం ప్యాక్ బాగా పనిచేస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: