మీకు మొటిమలు రావడానికి ఎలాంటి ఆహార పదార్ధాలు కారణమో తెలుసా...?!

frame మీకు మొటిమలు రావడానికి ఎలాంటి ఆహార పదార్ధాలు కారణమో తెలుసా...?!

Suma Kallamadi
ఆడవాళ్ళ అందాన్ని తగ్గించే వాటిలో మొటిమలు ముందు ఉంటాయి. ఎంత అందంగా ఉన్నాగాని మొటిమలు ఉంటే చూడడానికి అందవిహీనంగా ఉంటారు. మొటిమలులేని వారు చాలా తక్కువ మంది ఉంటారు. ఈ రోజుల్లో ఆడ,మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఎదుర్కొనే సమస్య మొటిమలు. ఈ మొటిమలు వచ్చాక ముఖం మీద నల్లటి మచ్చలు కూడా వస్తాయి. సాధారణంగా మొటిమలు అనేవి ఒత్తిడి, హార్మోన్లలో అసమతుల్యత, తీసుకొనే ఆహార పదార్థాల వల్ల సంభవించవచ్చు. ఇప్పుడు ఆ ఆహార పదార్ధాల గురించి తెలుసుకుందాం..మాములుగా జున్ను అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు.కానీ జున్నులో ప్రొజెస్టెరాన్ సమృద్ధిగా ఉండుట వలన కొవ్వు ఉత్పత్తి గ్రంధులను అధిక మొత్తంలో పెంచుతుంది. దీనితో చర్మం జిడ్డుగా మారి మొటిమలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీ ఆహారం నుండి జున్నును తొలగించండి.




అలాగే బ్రెడ్ తింటే కూడా మొటిమలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శరీరంలో యాంటీ ఆక్సిడెంట్స్ స్థాయిలను తగ్గిస్తుంది. బ్రెడ్ లో గ్లూటెన్ ఉండటం వలన మొటిమలను కలిగిస్తుంది. అందువల్ల మీ డైట్ నుంచి బ్రెడ్ ని తొలగించండి.బంగాళ దుంప చిప్స్, ఫ్రాంచ్ ఫ్రైస్, బాగా వేయించిన ఆయిల్ ఫుడ్స్ తీసుకోవటం పూర్తిగా మానేయాలి.ఇవి చర్మంపై వాపును కలిగించటానికి కారణం అవుతాయి.అది మొటిమలకు కారణం అవుతుంది.కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ ఆహారాలను మానేయటమే ఉత్తమం.




అలాగే ఎక్కువుగా నూనె పదార్ధాలు తీసుకోవడం కూడా మానివేయాలి.. కొవ్వు ఎక్కువగా ఉన్న ఆహారం తినడం వల్ల మొటిమల బెడద ఎక్కువ అవుతుంది. అలాగే మనం రోజు తినే ఫాస్ట్ ఫుడ్ లో అధిక కొవ్వులు నిల్వ ఉంటాయి. అవి రుచికి బాగుంటాయి కానీ అవి తినడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోయి బరువు పెరగడంతో పాటు మొటిమలు కూడా ఎక్కువగా వస్తాయి.. కాబట్టి మీ రోజువారి ఆహారంలో మార్పులు చేసుకోవడం వల్ల మొటిమలు రావు.. మీ అందం మీ చేతుల్లోనే ఉంది సుమా.. !!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: