అమ్మ : కడుపుతో ఉన్న మహిళ స్వీట్స్ ఎక్కువగా తింటే ఏమవుతుందో తెలుసుకోండి... !!

Suma Kallamadi
కడుపుతో ఉన్న మహిళకు చాలా రకాల కోరికలు ఉంటాయి.ఏవేవో తినాలని అనిపిస్తుంది.కానీ తినాలని అనిపించిన ప్రతి దాన్ని తినకూడదు. కడుపుతో ఉన్న సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి.ఈ సమయంలో తీసుకునే ఆహరం కూడా ఎంతో జాగ్రత్తగా తీసుకోవాలి.ఆరోగ్యమైన శిశువు కొరకు అన్ని కలిసిన పౌస్టికాహారము అనగా ఎక్కువపాలు, పండ్లు, ఆకుకూరలు, పప్పు, మాంసము, చేపలు వగైరా తీసుకోవాలి .ముఖ్యంగా ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి.
ఏది తిన్నా గాని ఆ ప్రభావం తల్లి బిడ్డపై చూపిస్తుంది.అలాగే చాలా మంది కడుపుతో ఉన్న మహిళలకు స్వీట్స్ తినాలనిపిస్తుంది. అయితే ఒక కన్ఫ్యూషన్ కూడా వెంటాడుతూ ఉంటుంది. స్వీట్స్ ఎక్కువగా తీసుకోవచ్చా లేదా.. !!పంచదార ఎక్కువగా తీసుకోవచ్చా... !అనే విషయాలు గర్భిణీ మహిళల్ని నిత్యం వెంటాడుతూ ఉంటాయి.వైద్యుల సలహా మేరకు ఈ క్రింది సూచనలు పాటించండి.అసలు స్వీట్లు పంచదార చాలా తక్కువుగా తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.షుగర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకోవడం వల్ల తల్లీ, బిడ్డా కూడా బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది.అందుకనే  ముందు నుంచి షుగర్ ఐటెమ్స్ కంట్రోల్ లో ఉంటే ఏ సమస్య ఉండదు.అంతేకాదు స్వీట్స్ ఎక్కువగా తింటే పిల్లలకి చిన్నప్పుడే గుండెకి సంబందించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
అందుకని  ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు తియ్యగా ఏమైనా తినాలనిపిస్తే స్వీట్స్ తినడం మానేసి, పండ్లు తినడం మంచిది. ఇక జ్యూస్ తీసుకున్నా అందులో పంచదార లేకుండా తీసుకోవడం ఉత్తమం.జ్యూస్ కన్నా పండ్లు తినడం చాలా మంచిది. శరీరానికి ఫైబర్ పుష్కలంగా దొరుకుతుంది. ఒకవేళ స్వీట్స్ తినాలనిపిస్తే చాలా తక్కువ మోతాదులో తినాలి. అంతేగాని మరి ఎక్కువగా తినకూడదు. కడుపుతో ఉన్న మహిళ షుగర్ ఎక్కువగా తినడం వల్ల రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోయి డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంది. అందుకని తల్లి బిడ్డ క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని స్వీట్స్ తినడం తగ్గిస్తే చాలా మంచిది.. !!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: