ఆడవాళ్లు గోర్లను ఈ రెండు రోజుల్లో అసలు కట్ చేయకూడదు.. !!

Suma Kallamadi
ఆడవాళ్లకు అందంగా ఉండడం అంటే చాలా ఇష్టం. అందుకనే రకరకాల హెయిర్ స్టైల్స్, మేకప్స్, మాచింగ్ నగలు వేసుకుంటారు.అంతేకాకుండా దానికి తగ్గట్టు చేతి వేళ్ళ గోళ్లు పొడవుగా పెంచి డ్రెస్ కి మ్యాచ్ అయ్యేలా గోళ్లరంగు కూడా వేసుకుని రెడి అవుతారు.చాలామంది గోర్లను అందంగా పెంచుకుంటూ ఉంటారు. కొందరైతే అన్ని గోర్లను కట్ చేసుకుని ఒక్క వేలి గోరును మాత్రమే స్టైల్ గా ఉంచుకుంటుంటారు.అలాగే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే గోళ్ళని అసలు పెంచవచ్చా..??ఒకవేళ కట్ చేయాలి అంటే ఏరోజు చేయాలి అన్న విషయం మీద క్లారిటీ లేదు.ఆ విషయాల గురించి ఈరోజు తెలుసుకుందాం. చాలామంది గోళ్లను ఏరోజు పడితే ఆరోజు కట్ చేస్తూ ఉంటారు.కానీ అది చాలా తప్పు.అలాచేయడం వల్ల మన ఇంట్లో కష్టాలతో పాటు దరిద్రం కూడా వస్తుంది.

అంతేకాదు మనమే స్వయముగా లక్ష్మి దేవిని  ఇంటి నుంచి బయటకి పంపిస్తున్నాము అన్నమాట. ఇలా ఏరోజు పడితే ఆరోజు గోళ్లు కత్తిరించుకుంటే అనేక రకాల ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవలిసి వస్తుంది.అలాగే ఇంట్లో ప్రశాంతతను కూడా కోల్పోతాము. అందుకనే చేతి వేళ్ళ గోళ్లను సోమవారం నాడే తీసుకోవాలి.అంతేగాని ఏరోజు పడితే ఆరోజు గోళ్లు కట్ చేయడం గాని, కొరకడం గాని చేయకూడదు. అలాగే కాళ్ళ గోళ్లను కూడా శనివారం రోజు మాత్రమే తీయాలి. అలాగే మంచం మీద కూర్చుని అసలు గోళ్లు తీయకూడదు.మన పెద్దలు కొన్ని ఏళ్లుగా ఫాలో అవుతున్న నియమాల ప్రకారం గోర్లను మంగళవారం అలాగే శుక్రవారం రోజుల్లో కట్ చేసుకోకూడదట. ఈ రెండు రోజుల్లో గోర్లను కట్ చేస్తే దరిద్రం అని అంటున్నారు.

అలాగే గోర్లను ఇంట్లో కట్ చేసుకోకూడదు.ఇంట్లో కట్ చేసుకున్నప్పుడు అవి కిందపడ్డట్లయితే అనుకోకుండా కాలితో తొక్కడం వలన కాలికి ప్రమాదం జరగవచ్చు. అంతే కాకుండా ఇంట్లో గోర్లను కట్ చేసుకోవడం మీ ఇంటికి మంచిది కాదు.  బయట కట్ చేసుకోవాలి.అలాగే  పెరుగుతున్న ఆ గోర్లను కట్ చేస్తూ ఉండాలి.వాటంతట అవి విరిగినప్పుడు ఆ బాధను భరించడం చాలా కష్టం. గోర్లను ఎక్కువగా పెంచడం వలన గోర్ల మధ్య మురికి ఎక్కువగా చేరుతుంది. అందుకే ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. గోర్లు బాగా పెరిగినప్పుడు వేళ్ళు,గోళ్ల మధ్య క్రిములు ఎక్కువగా చేరుతూ ఉంటాయి. మనం ఆహారం తీసుకునేటప్పుడు ఈ క్రిములు మన శరీరంలోకి వెళతాయి. అలాగే ఆహారం తీసుకున్న తర్వాత గోర్లు ఎక్కువగా ఉన్నవారు గోర్ల మధ్య ఏదైనా ఆహారం ఉంటే వెంటనే బాగా క్లీన్ చేసుకోవాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: