ఆడవాళ్ళ అందానికి కొబ్బరి పాలు మంచి ఔషధం.. !! ఎలానో చుడండి.. !!
ఒక కప్పు కొబ్బరి పాలల్లో ఒక స్పూన్ బాదం పొడి, ఒక స్పూన్ తులసి పొడి, కొంచెం తేనె వేసి కొద్దిగా నీరు కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేస్తే మృతకణాలు తొలగి చర్మం మృదువుగా తయారవుతుంది.గోరువెచ్చని నీటిలో కొద్దిగా రోజ్‌వాటర్, కొబ్బరి పాలు వేసి బాగా కలిపి ఈ మిశ్రమాన్ని స్నానానికి ఉపయోగించాలి. ఇలా చేయడం డల్ గా ఉన్న చర్మం తిరిగి తాజాదనాన్ని సంతరించుకుంటుంది. కొబ్బరిపాలను నేరుగా చర్మానికి అప్లై చేసుకొని సాఫ్ట్‌గా మర్దనా చేసుకోవచ్చు. ఇలా చేస్తే చర్మానికి తేమ అందుతుంది.కొబ్బరి పాలల్లో రెండు చుక్కల నిమ్మరసం కలిపి 10 నిమిషాల తర్వాత అందులో దూదిని ముంచి ముఖమంతా అద్దుకోవాలి.
ఇలా చేస్తే ముఖంపై పేరుకున్న మురికి తొలిగి తాజాగా మారుతుంది.కొబ్బరి పాలలో తేనె, 2 చెంచాల బియ్యపు రవ్వ, ఒక స్పూన్ బాదం నూనె కలిపి ఆ మిశ్రమాన్ని పాదాలకు రాసుకుని 5 నిమిషాలపాటు మర్దనా చేసి ఆరిన తర్వాత చల్లటి నీళ్లతో కడిగితే పాదాలు మృదువుగా మారతాయి.పొడి చర్మం సమస్యతో బాధపడుతున్న వారికి కొబ్బరి పాలు చాలా చక్కని పరిష్కారం. కొబ్బరి పాలను చర్మానికి నేరుగా అప్లై చేసి మసాజ్ చేసి 20 నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత శుభ్రం చేసుకుంటే మృదువైన, మెత్తని చర్మం మీ సొంతమవుతుంది.గులాబి రేకులు, ఒక స్పూన్ తేనె, అరకప్పు కొబ్బరి పాలను ఒక బకెట్ గోరువెచ్చని నీటిలో వేసుకొని స్నానం చేయడం వల్ల శరీరానికి తగిన తేమ అంది చర్మం కాంతివంతంగా తయారవుతుంది.