అమ్మ : గర్భంతో ఉన్న స్త్రీ ఇటువంటి ఆహార పదార్ధాల తినడం మంచిదేనా... !!

Suma Kallamadi
గర్భంతో ఉన్నపుడు చాలా మంది స్త్రీలకు కొన్ని అపోహలు ఉంటాయి. ఏమి తినాలి ఏమి తినకూడదు అని అనుమానంతో కొన్ని రకాల ఆహారపదార్ధాలు తినకుండా ఉంటారు. కొన్ని రకాల పండ్లు తినడం మూలంగా గర్భిణీ స్త్రీలకు  సమస్యలు వస్తాయని చాలా మంది భావిస్తారు.. అవేంటో తెలుసుకుందాం.. !! మొదటగా చాలామంది బొప్పాయి తినడం వల్ల గర్భస్రావం అవుతుందని చాలా మంది తినరు. కానీ ఇది ఎంత మాత్రం నిజం కాదు. ఇందులో అధిక కేలరీలు ఉంటాయి. అందుకే తొందరగా జీర్ణం కాదు. అందువల్ల విరేచనాలు, బహిష్టు స్రావం కల్గవచ్చు.ఇది చాలా బలహీనంగా ఉన్న వారి లో మాత్రమే కనిపించే అవకాశం ఉంది.అలాగే కొబ్బరి నీళ్లు తాగడం అందరికీ మంచిది. ఇందులో ఎక్కువ మోతాదులో పొటాషియం లవణాలు ఉంటాయి.



అందుకే ఎక్కువ తాగితే జలుబు చేసి కఫం రావచ్చు.అంతే కానీ కొబ్బరి నీళ్లు తాగితే జలుబురాదు.మాంసాహారంలో ఎక్కువ మాంసకృత్తులుంటాయి. మాంసం తినడం వల్ల శరీరం దృడంగానూ,బలంగానూ తయారవుతుంది. శాకాహారం కన్నా మాంసాహారం కొంతవరకూ మేలే. గుడ్లు తినడం వల్ల ఎటువంటి నష్టమూ జరగదు. కొంతమంది గుడ్లు ఎక్కువగా తింటే పుట్టే పిల్లలకు జుట్టు సరిగా రాదు అని నమ్ముతారు. కానీ ఇది నిజం కాదు. గుడ్డులో ఎక్కువ కేలరీలు ఉంటాయి అలాగే త్వరగా జీర్ణం కాదు.అందు వల్ల అధికంగా తినకపోవడమే మంచిది. నారింజ, అనాస తినడం వల్ల వెంటనే జలుబు వచ్చేయదు. శీతాకాలంలోనో, చల్లగా ఉన్నప్పుడో తింటే జలుబు చేసే అవకాశం ఉంటుంది.



రోగ నిరోదక శక్తి తక్కువ ఉన్న వారికి వచ్చే ఆస్కారం ఉంది.నెలసరి సమయంలో నువ్వులు తినడం వల్ల బలంగా ఉంటారు. అలాగే నువ్వుల కేలరీల రేటు ఎక్కువగా ఉంటుంది గనక హార్మోన్లు సులువుగా విడుదల అవుతాయి. అందువల్ల రుతుస్రావం ఫ్రీగా అవుతుంది.దీన్నే ఎక్కువగా రక్తస్రావం అవుతుందనుకొని భయపడి నువ్వులు తినొద్దు అంటారు.అరటిపండు తినడం వల్ల పిల్లలు నల్లగా పుట్టరు.కానీ కొంత మందికి కుంకుమ పువ్వు తింటే పిల్లలు ఎర్రగా పుడతారు. కొంతమంది కడుపుతో ఉన్నపుడు జున్ను తినకూడదు అంటారు. కానీ జున్ను ఆరోగ్యానికి ఎంతో మంచిది.దీనిలో ఎక్కువగా కొవ్వు పదార్ధాలు ఉంటాయి.అందువల్ల ఎక్కువ తింటే అజీర్ణం చేయవచ్చు. అందుకే మిరియాలను కలుపుకొని తినాలి. దానివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు.Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: