మందారంతో మీ అందాన్ని మరింత పెంచుకోండి... !!

Suma Kallamadi

ఆడవాళ్లు అందంగా కనిపించడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు .మార్కెట్లో దొరికే ప్రతి ఒక్క బ్యూటీ ప్రోడక్ట్ ని వాడతారు.ఎంత ఖర్చు అయిన పెడతారు.ఇలా మార్కెట్లో దొరికే వివిధ రకాల  క్రీమ్స్ వాడే బదులు సహజంగా లభించే వాటితో అందానికి మెరుగులు దిద్దుకుంటే మంచి ఫలితం ఉంటుంది.అలాగే ఖర్చు కూడా తక్కువ అవుతుంది. అలాంటి కోవకు చెందిన వాటిలో మందారం ఒకటి. దీనివల్ల మన చర్మానికి అలాగే జుట్టుకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.. !!మందారం నూనె జుట్టు పెరుగుదలను పెంచుతుంది . అలాగే జుట్టును మూలాల నుండి బలపరుస్తుంది. ఇది జుట్టు మెరుస్తూ కనిపించేలా చేస్తుంది.

 

మందారంలో  విటమిన్-సి సమృద్ధిగా ఉండడం వలన జుట్టు కుదుళ్లను బలంగా చేస్తుంది.మందార నూనె తలవెంట్రుకలను పరిరక్షించుకోవటమే కాక చర్మ రక్షణకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది.మందార  నూనెతో మసాజ్ చేస్తే చుండ్రు నివారించవచ్చు.జుట్టు రాలటం తగ్గడమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.కేశాలు తెల్ల బడకుండా ఉపకరిస్తుంది.అలాగే పాదాల సంరక్షణలోనూ ఎంతగానో ఉపయోగ పడుతుంది. పాదాల పగుళ్ళు తగ్గేందుకు ఈ నూనెతో మసాజ్ చేస్తే మంచి ఫలితాలొస్తాయి.

 

 

మందార పువ్వు గాని, ఆకులను గాని బాగా ఎండలో ఎండపెట్టి వాటిని మెత్తని పొడిలా చేసి నూనెలో కలిపి తలకు రాసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి  మీరుస్నానానికి ఉపయోగించే నీటిలో మందార నూనెను కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ చర్మం అదంగా ఉండడంతో పాటు ఎక్కువ సమయం సుగంధభరితంగా ఉంటుంది. అలాగే ఈ మందారం పువ్వుతో ఫేస్ ప్యాక్ కూడా వేసుకోవచ్చు. కానీ దీనిని  ఒక వారం ముందు నుండే తయారుచేసుకోవాలి. ఫ్రెష్ గా ఉన్న మందారం పువ్వులు తీసుకుని, ఎండబెట్టాలి. ఒక వారం పాటు ఎండ బెట్టి తర్వాత పొడి చేసుకోవాలి. మీరు ఎప్పుడన్నా ఫేస్ ప్యాక్ వేసుకోవాలనుకున్నపుడు, ఒక బౌల్ తీసుకుని అందులో ఒక స్పూన్ మందారం పువ్వు పౌడర్, బ్రౌన్ రైస్ పౌడర్, వేసి కలిపి పెట్టుకోవాలి. ఈ పొడిలో కొద్దిగా పెరుగు, కలబంద రసం వేసి బాగా కలపాలి. తర్వాత  ప్యాక్  వేసుకోవాలి. అంతే ఎంతో అందమైన ఫేస్ మీ సొంతం.. అచ్చం బ్యూటీ పార్లర్ కి వెళ్ళివచ్చినట్లు ఉంటుంది ముఖం...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: