అమ్మ: వర్షాకాలంలో గర్భిణీ స్త్రీలు తీసుకోవాలిసిన అదనపు జాగ్రత్తలు ఇవే...!

Suma Kallamadi

వర్షాకాలం రావడం వల్ల గర్భిణీ స్త్రీలు అనేక సమస్యలను ఎదుర్కోవలిసి ఉంటుంది. ఈ కాలంలో గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తలు వహించాలి.ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న తల్లి బిడ్డ ఇద్దరికి ప్రమాదమే. ఈ కాలంలోనే  అంటు వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.ఈ వర్షం కారణంగా ప్రతిచోటా తేమ ఉంటుంది.తేమ,నీరు నిల్వ ఉండడం వల్ల  బ్యాక్టీరియా చురుకుగా మారుతుంది. అనేక రకాల వ్యాధులు కూడా ఎక్కువగా వ్యాపిస్తాయి.అలాగే దోమల వ్యాప్తి కూడా ఎక్కువగా ఉంటుంది. డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులు వచ్చే అవకాశం లేకపోలేదు.అందుకనే వర్షాకాలంలో గర్భిణీ స్త్రీలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అవేంటో చుడండి.. !!

 


గర్భిణీ స్త్రీలు తమ ఆహారం యొక్క పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. బయట ఏదైనా తినడానికి ముందు, అది శుభ్రంగా ఉందా లేదా అనే దానిపై శ్రద్ధ పెట్టాలి. ఈ సీజన్లో, గర్భిణీ స్త్రీలు అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, కాల్షియం, ప్రోటీన్ మరియు కేలరీలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఈ సీజన్‌లో అంటు వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది, తాగునీటి పరిశుభ్రత విషయంలో గర్భిణీ స్త్రీలు పరిశుభ్రమైన నీరు తాగాలి.రుతుపవనాలలో కలుషితమైన నీటి నుండి అనేక వ్యాధుల ప్రమాదం ఉంది. కాబట్టి ఎప్పుడూ ఫిల్టర్ చేసిన నీరు త్రాగాలి. ఒకవేళ ఫిల్టర్ అందుబాటులో లేకపోతే కాచి చల్లార్చిన నీళ్లు తాగడం ఉత్తమం.సాధ్యమైనంత వరకు చల్లని నీళ్లు తాగకుండే ఉంటే మంచిది.గర్భధారణ సమయంలో ఇంటి శుభ్రతను జాగ్రత్తగా చూసుకోవాలి. 

 

 

బాత్రూమ్ శుభ్రం చేయడానికి మంచి నాణ్యమైన జెర్మిసైడ్ ఉపయోగించండి. ఈ సీజన్లో సూక్ష్మక్రిములు త్వరగా వ్యాపిస్తాయి.అందువల్ల, మీ ఇంటిని శుభ్రంగా మరియు చక్కగా ఉంచాలి. అలాగే దోమలు ఇంట్లోకి రాకుండా క్రిమిసంహారక మందులు వాడండి. ఎక్కువ పవర్ ఉన్నాయి మాత్రం వాడకండి. వర్షం యొక్క మురికి నీటి నుండి సంక్రమణ ప్రమాదం ఉంది. కాబట్టి, మీరు మీ చేతులు మరియు కాళ్ళను శుభ్రం చేయడానికి కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అన్ని పనులు చేతులతో ప్రారంభమవుతాయి. అందువల్ల చేతుల ఎల్లపుడు శుభ్రంగా ఉంచుకోవాలి. బయటి నుండి వచ్చిన తర్వాత ఎల్లప్పుడూ చేతులు, కాళ్ళు కడుక్కోండి. అలాగే మీరు బయటకు వచ్చినప్పుడల్లా హ్యాండ్ శానిటైజర్‌ను మీ వద్ద ఉంచండి. చెప్పులు లేకుండా బయటకు వెళ్ళడం మర్చిపోవద్దు. గర్భిణీ స్త్రీలు బయటకు వెళ్ళేటప్పుడు తప్పకుండా బ్యాగ్ లో గొడుగు పెట్టుకోవడం మర్చిపోవద్దు. వర్షంలో తడవటం వల్ల జలుబు చేసే అవకాశం ఉంది. అందుకనే ఎప్పుడు కూడా గొడుగుని తీసుకుని వెళ్ళండి. అలాగే మందుబిళ్లలు సమయానికి వేసుకోవాలి. ఆహారంలో అన్ని పోషకవిలువలు ఉండేలాగా చూసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: