ఆడవాళ్ళ అందమైన పెదవుల కోసం కొన్ని అద్భుతమైన చిట్కాలు.. !!

Suma Kallamadi

ఆడవాళ్ళ అందం గూర్చి ఎంత వర్ణించిన తక్కువే. అందులోను అందమైన  వారి పెదవులు గూర్చి  మాటల్లో చెప్పలేము. కానీ ఒక్కోసారి స్త్రీలు వారి పెదవుల విషయంలో ఎంతో ఇబ్బందికి గురి అవుతున్నారు.అయితే కారణం ఏదైననూ వారి అందమైన పెదవులు రంగు మారి నల్లగా అవ్వడం,వారికి ఇబ్బందిని కలిగిస్తుంది.ఈ ఇబ్బందిని తొలగించి, వారి పెదవులు మిలమిలా మెరిసేలా చేసే కొన్ని చిట్కాలు చూద్దామా.. 

 


మీరు మర్కెట్లోకి వెళ్ళితే మీ పెదవులను కాపాడుకోవడానికి ఎన్నో రకముల “లిప్ కేర్”, “లిప్ బాం”లు దొరుకుతాయి, అయితే పూర్తిగా వాటి మీద ఆదారపడితే ప్రయోజనం ఉండకపోగా, కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఎక్కువ, అందుకే మీ ఇంట్లోనే ఎంతో సహజమైన,సులభంగా తయారుచేసుకునే చిట్కాలు ఇవి. బాదం ఆయిల్ని మీ పెదాలకు పట్టించాలి, ఇలా రోజు చేస్తూ ఉంటే, మీ పెదాల మీద ఉన్న  నల్ల రంగు పోయి అందంగా మారతాయి. మీ చర్మ సౌందర్యాన్ని, పెదవుల అందాన్ని, కాపాడడంలో “కీరా దోసకాయ” ఎంతో ప్రత్యేకం, ఐతే దీని వల్ల మీ పెదవులే కాకుండా మీ శరీరంలోని పాదాలు, చేతుల కింద నల్లని మచ్చలు,ఇలా నల్లబడిన ప్రదేశాలన్నీ బాగు చేసుకోవచ్చు.మీ పెదవుల సంరక్షణకై దీని రసాన్ని తీసి రాయండి,ఇలా రోజూ చేస్తే ఇది మీ పెదవుల పై మంచి ప్రభావం కనిపిస్తుంది. 

 

 


మీ పెదవులను  కాపాడుకోవడానికి చర్మాన్ని అందంగా ఉంచుకోవడానికి, ఈ పద్దతి బాగా ఉపయోగపడుతుంది, మీరు చేయవలసిందల్లా కొంచెం పచ్చి పాలు తీసుకుని కాటన్  తో కాని, లేదా ఎదైన పొడి గుడ్డతో కాని మీ పెదవుల్ని తుడవండి.పచ్చి పాల ప్రభావంతో మీ పెదవుల చర్మంలోని చనిపోయిన కణాలు తొలగి పోయి, అందమైన కాంతివంతమైన పెదాలు మీకు లభిస్తాయి. తేనె,పెరుగు, నిమ్మరసం,ఈ మూడు  మిశ్రమాలని కలిపి మీ పెదవలకు పట్టించి, ఒక గంట తరువాత మెల్లగా కడగండి, ఇలా చేస్తూ ఉంటే మీ పెదవులు అందంగా మారతాయి.మీ పెదవుల అందం కోసం ఎంతో డబ్బులు ఖర్చు చేసి, తిరిగి ఇబ్బందులు పడే కన్న మీ ఇంట్లొనే మీ ఫ్రిజ్ లో ఉన్న వెన్నను కొంచెం తీసి రోజూ మీ పెదవులకు రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇలా  2-3 వారాలు చేస్తే అందమైన పెదవులు మీ సొంతం అవుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: