ముఖం మీద అవాంచిత రోమాలను తొలగించే సహజ సిద్దమైన చిట్కాలు.. !!
అవేంటో ఒకసారి చూద్దాం.. ఒక చిటికెడు పసుపుతో పెరుగు మరియు కొద్దిగా బియ్యపు పిండిని జోడించండి. ఈ పదార్ధాలన్నింటినీ కలిపి మీ ముఖానికి ఈ మిశ్రమాన్ని రాయండి. ఆ మిశ్రమము పొడిగా అయ్యేవరకు ఉండనివ్వండి. తర్వాత చల్లటి నీటితో కడగాలి. ఈ పేస్ట్ ని రెగ్యులర్ గా వాడటం వల్ల కాలక్రమేణా ముఖం మీద జుట్టు పెరుగుదలను తగ్గిస్తుంది.అలాగే ఒక్కోసారి వాక్స్ చేసుకోవడం కుదరనప్పుడు మన ఇంట్లో దొరికే కొన్ని పదార్ధాలతో వెంట్రుకలని నివారించవచ్చు. కొంచెం పంచదార, నిమ్మరసం, నీరు ఉంటే చాలు. ఇంట్లో వ్యాక్స్ చేయటానికి కావాల్సిందల్లా కొంచెం నీరు, నిమ్మరసం మరియు చక్కెర.
ఒక గిన్నెలో కొద్దిగా నీరు తీసుకోవాలి అందులోనే పంచదార, నిమ్మరసం వేసి దగ్గిరగా అయ్యేవరకూ కలపాలి. తరువాత దీన్నే వ్యాక్స్ గా ఉపయోగించవచ్చు. దీని కోసం మీకు వ్యాక్స్ స్ట్రిప్స్ కూడా అవసరం లేదు. అయితే చెక్కరని మీ ముఖానికి రాసుకునే ముందు మీ చర్మానికి ఎంత వేడి సరిపోతుందో చూసి ముఖంపై రాయండి. లేకపోతే కాలే ప్రమాదం ఉంది.గుడ్డులోని తెల్ల సొనని తీసుకోండి. అందులో ఒక టేబుల్ స్పూన్ పంచదార మరియు ఒక అర టేబుల్ స్పూన్ జొన్న పిండిని కలపండి. పేస్టు ఏర్పడే వరకు బాగా కలపండి. తర్వాత ముఖ రోమాలు కలిగిన చోట దానిని అప్లై చేయండి. దానిని మాస్క్ వలె ఏర్పడే వరకు ఆరనివ్వండి.
అప్పుడు అది ముఖంపై అవాంఛిత రోమాలను సులభంగా తెంచి తొలగించగలుగుతుంది. ఈ గుడ్డు మాస్కు యొక్క నివారణ సాధారణంగా గృహంలో అధికంగా ఉపయోగించే పధార్ధాలతో మంచి ఫలితాలను అందిస్తుంది.Powered by Froala Editor