నాగార్జున భార్యతో పెళ్లి.. భార్యకి విడాకులు ఇవ్వాలనుకున్న రజినీకాంత్.?

Pandrala Sravanthi
ఏంటి అక్కినేని నాగార్జున భార్య అమలని రజినీకాంత్ పెళ్లి చేసుకోవాలనుకున్నారా? ఇదెక్కడి ట్విస్ట్ అనుకుంటారు చాలామంది ఈ విషయం తెలిసి. మరి ఇంతకీ అమలకి రజినీకాంత్ కి మధ్య ఉన్న సంబంధం ఏంటి.. భార్యకు విడాకులు ఇచ్చి మరీ రజినీకాంత్ అమలని పెళ్లి చేసుకోవాలనుకున్నారా అనేది ఇప్పుడు చూద్దాం.. కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే కేవలం తమిళ సినిమాల్లోనే కాదు సౌత్ లో ఇంకా చెప్పాలంటే ఇండియాలోనే  ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న హీరో.. చూడ్డానికి హీరో కటౌట్ ఏమాత్రం లేని రజినీకాంత్ తన స్టైల్ యాక్టింగ్ తోనే హీరో అయ్యారు. హీరో అంటే కలర్ ఉండాలి హైట్ వెయిట్ పర్సనాలిటీ సిక్స్ ప్యాక్ ఉండాలి అనుకుంటారు.

కానీ అవేవీ లేకుండానే రజినీకాంత్ తన యాక్టింగ్ తో హీరో అయ్యారు. అయితే అలాంటి ఈ హీరో గతంలో అమలని పెళ్లి చేసుకోవాలనుకున్నారనే రూమర్లు వినిపించాయి. అయితే అమల రజినీకాంత్ కాంబినేషన్లో కోడి పళుత్తు, మాప్పిలై, త్లైకరన్ వంటి సినిమాలు వచ్చాయి. అయితే వరుస సినిమాలు కలిసి చేసేసరికి రజినీకాంత్ అమల మధ్య ఎఫైర్ ఉన్నట్టు కోలీవుడ్ లో వార్తలు క్రియేట్ చేశారు కొంత మంది.. అంతేకాదు అప్పట్లో రజినీకాంత్ అమలని  పెళ్లి చేసుకోవాలనుకున్నారని ,కానీ ఆ సమయంలో రజినీకాంత్ ఏజ్ 36 ఏళ్లయితే అమల వయసు కేవలం 19 ఏళ్లేనని అయినా కూడా పెళ్లయిన రజినీకాంత్ పిల్లలు ఉన్నా కూడా భార్యకు విడాకులు ఇచ్చి అమలని పెళ్లి చేసుకోవాలనుకున్నారు అంటూ రూమర్లు వినిపించాయి.

అంతేకాదు అమల కారణంగా రజినీకాంత్ లత మధ్య దాదాపు సంవత్సరం పాటు గొడవలు జరిగినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలన్నింటిపై తాజాగా ఓ తమిళ నటి క్లారిటీ ఇచ్చింది. అమల రజినీకాంత్ పెళ్లి చేసుకోవాలనుకున్నారు అనే వార్తల్లో ఎలాంటి నిజం లేదు. అది కేవలం కొంతమంది క్రియేట్ చేసిన రూమర్స్ మాత్రమే.అసలు ఇందులో ఎలాంటి నిజం లేదు అంటూ ఆ నటి క్లారిటీ ఇచ్చింది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: