గోరింటాకు ఎర్రగా పండడానికి అరుదైన చిట్కాలు.. !!

Suma Kallamadi

 

గోరింటాకు అంటే ఇష్టంలేని మహిళలు ఎవ్వరూ ఉండరు. పండగలకు, శుభకార్యాలకు మహిళలు ఈ గోరింటాకును ఎంతో ఇష్టంగా పెట్టుకుంటారు.మహిళలు గోరింటాకు ఎర్రగా పండాలని కోరుకుంటారు గోరింటాకు ఎంత ఎర్రగా పండితే అంత మంచి మొగుడు వస్తాడని చాలామంది నమ్మకం.  మగువలకు ఇష్టమైన గోరింటాకు ఎర్రగా పండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం...గోరింటాకు పెట్టుకునే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత చేతికి ఎలాంటి తడి లేకుండా చూసుకుని తర్వాత మీకు ఇష్టమైన డిజైన్‌ను మీ చేతుల్లో అలంకరించుకోండి.

 

 

 

ఏడు నుంచి ఎనిమిది గంటలు అలాగే ఉంచండి. మీరు గోరింటాకు 12 గంటలు అలాగే ఉంచవచ్చు. అదే సమయంలో గోరింటాకు (మెహందీ) తీసినపుడు చాలామంది నీటితో సబ్బుతో కడుగుతారు అలా కాకుండా నీళ్లు లేదా ఎలాంటి సబ్బు ఉపయోగించకుండా గోరింటాకు ఎండు పోయిన తర్వాత గోరింటాకును అర చేతులను కలిపి రుద్దడం ద్వారా గోరింటాకును తొలగించండి. గోరింటాకు పూర్తిగా తొలగించే వరకు ఇలా చేయండి. ఇలా చేయడం ద్వారా మీరు కొన్ని గంటల ప్రభావాన్ని చూస్తారు మరియు మీరు మెహందీ ఎర్రగా అందంగా ఎక్కువ కాలం ఉంటుంది.

 

 


గోరింటాకు ఎర్రగా పండాలంటే నూరేటప్పుడు రెండు చుక్కల యూకలిప్టస్ ఆయిల్, రెండు చెంచాల నిమ్మరసం కలుపుకోవాలి. గట్టిగా రుబ్బిన తర్వాత గంటపాటు అలానే ఉంచి, ఆ పైన పెట్టుకుంటే చేతులు చక్కగా పండుతాయి. 
గోరింటాకుని నూరుకునేటప్పుడు రెండు లవంగాలూ, నిమ్మరసం, పంచదార, వక్క వంటివి కలుపుకున్నా చేతులు బాగా పండుతాయి. గోరింటాకు తీసేశాక ఆవనూనె రాసుకుంటే మంచి రంగు వస్తుంది. గోరింటాకు కనీసం నాలుగు గంటల పాటు చేతికి ఉంచుకుంటే చేతులు ఎర్రని వర్ణంతో మెరుస్తాయి.ఆవనూనె లేదా వాసెలిన్  రాసుకోవడం వల్ల గోరింటాకు రంగు ఎక్కువ కాలం ఉంటుంది.గోరింటాకు పూసిన తర్వాత చేతితో ఎక్కువగా పని చేయవద్దు ఇలా పని చేయడం వల్ల చేతి పై ఉండే గోరింటాకు కదిలి మీ చర్మం పై పొరను పీల్ చేస్తుంది మరియు మెహందీని కూడా పాడు చేస్తుంది.చక్కెర మరియు నిమ్మకాయ మిశ్రమాన్ని ఎక్కువగా ఉపయోగించవద్దు గోరింటాకు ముదురు గోధుమ రంగులోకి మారుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: