ట్రంప్‌కు షాకిచ్చిన చిన్న కూతురు... తండ్రికి వ్య‌తిరేకంగా ఏం చేసిందంటే..?

Spyder

పోలీసుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన ఆఫ్రో-అమెరికన్‌ జార్జి ఫ్లాయిడ్‌ మృతిపై అమెరికాలో ఊపిరి ఆడ‌టం లేదు ఉద్యమం ఉధృతంగా సాగుతున్న విష‌యం తెలిసిందే. ఈ ఉద్య‌మానికి యావ‌త్తు ప్ర‌పంచ దేశాల్లోని విభిన్న వ‌ర్గాల ప్ర‌జ‌లు మ‌ద్ద‌తు ప‌లుకుతున్నారు. అక్క‌డి ట్రంప్ ప్ర‌భుత్వం కూడా నిర‌స‌న సెగ‌ల‌తో అత‌లాకుత‌లం అవుతోంది. స‌రిగ్గా ఐదు రోజుల క్రిత‌మైంతే అధ్య‌క్షుడు ట్రంప్  భ‌ద్ర‌తపైనా కూడా ఉత్కంఠ రేగింది. ఏకంగా బంక‌ర్‌లోకి త‌ల‌దాచుకోవ‌డం గ‌మ‌నార్హం. అయితే క్ర‌మంగా ఉద్య‌మం చ‌ల్ల‌బ‌డుతోంది. ఆఫ్రో అమెరిక‌న్లు క్ర‌మంగా శాంతియుత పద్ధ‌తిలో త‌మ నిర‌స‌న‌ను వ్య‌క్తం చేస్తున్నారు.


 ఇదిలా ఉండ‌గా ఈ నిర‌స‌న‌లకు ట్రంప్ చిన్న కూతురు టిఫాని మ‌ద్ద‌తు ప‌ల‌క‌డం ఇప్పుడు ట్రంప్‌ను ఇర‌కాటంలో ప‌డేసిన‌ట్ల‌యింది.  హింసాత్మక నిరసనలను అణచివేయడానికి సైన్యాన్ని దించ‌డానికి కూడా వెన‌కాడ‌బోమని ట్రంప్ ప్ర‌క‌టించిన మ‌రునాడే టిఫాని నిర‌స‌న‌కారుల‌కు మ‌ద్ద‌తు ప‌ల‌క‌డం విశేషం. అమెరికాలో జాతి వివక్ష, పోలీసుల అరాచకాలను వ్యతిరేకిస్తూ  అమెరికాలోని చాలా రాష్ట్రాల్లో నిరసనలు హోరెత్తుతున్న విష‌యం తెలిసిందే.  ఈ నిర‌స‌న‌ల‌కు బాస‌ట‌గా, ప్ర‌భుత్వ వైఖ‌రిని ఎండ‌గ‌డుతూ సామాజిక మాధ్యమాల్లోనూ బ్లాక్‌ఔట్‌ ట్యూస్‌డే, జస్టిస్‌‌ ఫర్‌ జార్జ్‌ ఫ్లాయిడ్‌ హ్యాష్‌టాగ్‌ పేరుతో ట్రెండింగ్ అవుతున్నాయి.


 సామాజిక మాద్య‌మాల్లో జ‌రుగుతున్న నిర‌స‌న కార్య‌క్ర‌మాల‌కు త‌న మ‌ద్ద‌తు తెలుపుతూ ట్రంప్  చిన్నకుమార్తె టిఫాని ట్రంప్‌ నలుపురంగులో ఉన్న ఫోటోను ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లలో షేర్‌ చేయ‌డం విశేషం. ఫ్లాయిడ్‌ ఆఫ్రో-అమెరికన్‌. డెరక్‌ చౌవిన్‌ అనే శ్వేతజాతి పోలీసు అధికారి జార్జి ఊపిరాడటంలేదని మొర పెట్టుకుంటున్నా వినకుండా అతడి మెడపై మోకాలుతో తొక్కి ఊపిరాడకుండా చేయడంతో అతడు మరణించిన విష‌యం తెలిసిందే. బహిరంగ ప్రదేశంలో ఇంత కర్కశంగా పోలీసులు ఫ్లాయిడ్‌ను అమానుషంగా హత్య చేసిన తీరుపై అమెరికా అంతటా ఆగ్రహజ్వాలలు వ్యాపించాయి.జార్జి హత్యకు న్యూయార్క్‌, వాషింగ్టన్‌ సహా 40 నగరాల్లో ఇప్పుడు రాత్రిపూట కర్ఫ్యూ న‌డిచింది. అయితే ప్ర‌స్తుతం క్ర‌మంగా నిర‌స‌న జ్వాల‌లు త‌గ్గుముఖం ప‌ట్టాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: