ప్రెగ్నెన్సీ టైమ్‌లో ఏ నెల వరకు సెక్స్ చేసుకోవచ్చో తెలుసా..??

Kavya Nekkanti

సాధార‌ణంగా పెళ్లి త‌ర్వాత ఓ మ‌హిళ తాను ప్రెగ్నెంట్ అని తెలిసిన‌ప్ప‌టి నుండీ ఎంతో ఆనందంగా ఉంటుంది. త‌న క‌డుపులో బిడ్డ గురించి ఎన్నో క‌ల‌లు మ‌రెన్నో ఆశ‌లు పెట్టుకుంటుంది. మ‌రియు త‌న బిడ్డ ఆరోగ్యంగా, అందంగా పుట్టాల‌ని ఆరోగ్య జాగ్ర‌త్త‌ల‌తో పాటు అన్ని జాగ్రత్త‌లు తీసుకుంటుంది. ఇక ప్రెగ్నెన్సీ మహిళలు గర్భం దాల్చినప్పటి నుంచి సెక్స్ పట్ల ఆసక్తి చూపరు. ఎందుకంటే.. గర్భంతో ఉన్నప్పుడు సెక్స్ చేయడం కష్టంగా ఉంటుంది. మ‌రియు సెక్స్ చేస్తే పుట్టబోయే బిడ్డకు ప్రమాదం అని చాలామంది మ‌హిళ‌లు అనుకుంటుంటారు. మగవారు కూడా గర్భంతో ఉన్న భార్యతో సెక్స్ చేసే సాహసం చేయరు.

 

అయితే గర్భవతిగా ఉన్నప్పుడు మీ డాక్ట‌ర్‌ లైంగిక వాంఛకు వ్యతిరేకంగా సలహా ఇస్తే తప్ప, సెక్స్ గర్భధారణ సమయంలో సంపూర్ణ సురక్షితం అని చెప్పువచ్చు. మ‌రియు గర్భంతో ఉన్నప్పుడు కూడా సెక్స్‌ను ఆస్వాదించొచ్చని అంటున్నారు సెక్సాలజిస్టులు.  కానీ, గర్భవతి గా ఉన్న సమయంలో ఆరవ నుండి పన్నెండవ వారం వరకు సెక్స్ లో కలవకూడదు. ఎందుకంటే ఇది గర్భస్రావం కలిగిస్తుంది. మ‌రియు గర్భం యొక్క చివరి రెండు నెలల్లో కూడా సెక్స్ చేయ‌కూడ‌దు. ఇక ఏడో నెల వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని భంగిమల్లోనూ సెక్స్ చేసుకోవచ్చని పేర్కొంటున్నారు. 

 

ఈ టైమ్‌లో సెక్స్ చేయ‌డం వ‌ల్ల కొన్ని ఉప‌యోగాలు కూడా ఉన్నాయ‌ట‌. వాస్త‌వానికి సెక్స్ అనేది వ్యాయామానికి ప్రతిరూపం లాంటిది. కాబట్టి గర్భిణీలు సెక్స్ చేయడం వారికి వ్యాయామంగా పనికొచ్చి బరువు తగ్గేందుకు సహకరిస్తుంది. అంతేకాకుండా.. గర్భవతిగా ఉన్నప్పుడు సెక్స్ లో పాల్గొనటం వల్ల వారిలో నూతన ఉత్సాహం కలుగుతుంది. మానసిక ఒత్తిడిని దూరం చేస్తుంది. మనసును తేలిక ప‌రిచేలా చేస్తుంది. ఇక‌ ఆరోగ్యంగా ఉన్న మహిళ సెక్స్ లో పాల్గొంటే ఎలాంటి నష్టం కలగదు. అనారోగ్యంతో ఉన్న గర్భిణీ మాత్రం అందులో పాల్గొనకూడదు. అలాగే ఈ విష‌యంలో ముందు మీరు  డాక్టర్స్ ని సంప్రదిస్తే స్త్రీ ఆరోగ్య స్థితిని బ‌ట్టీ వాళ్లే క్లారిటీ ఇస్తారు.

 
   

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: