అమ్మ : మనకు జన్మనిచ్చిన మాతృమూర్తికి మనం ఇచ్చే కానుక ఏంటి... !!
అమ్మ అన్నమాట కి అర్దాలే వేరు.. ఎన్ని చెప్పిన అమ్మ గొప్పతనం ముందు అన్ని తక్కువే. పుట్టినప్పటినుండి ఎన్నో కష్టాలు, ఒడిదుడుకులని ఎదుర్కొని మనల్ని ముందుకు నడిపే గొప్ప త్యాగమూర్తి అమ్మ.. పసితనంలో అమ్మ వెలుపట్టుకుని నడిచి, నడవడిక నేర్పింది మన అమ్మేకదా !! వయసుకు వచ్చాక నెల నెల నెలసరి సమస్య తో బాధ ని అనుభవించి, వయసుకు వచ్చాక సమాజంలోని క్రూరముగాలనుండి ఎలాగోల తపించుకుని, పెళ్లి అనే మూడు ముళ్లబంధం లోకి అడుగుపెడుతుంది...
ఎవరో తెలియని వ్యక్తితో తాళి కట్టించుకుని, అత్తవారింట్లో అడుగుపెట్టి ఎన్నో ఒడిదుడుకులని ఎదుర్కొంటుంది.. అమ్మ-నాన్నలని ఒక్కసారి గా వదిలేసి, ఉన్న ఊరినుండి వేరే ఊరు, వేరే ఇల్లు, వేరే మనుషులు, కొత్త ప్రపంచంలోకి అడుగుపెడుతుంది.. అప్పగింతలపుడు ఎంత ఏడుస్తారో వాళ్ళకే తెలుసు.
సంసార సాగరంలో మునిగి పోయి తన బాధ్యతలని నెరవేరుస్తూ, ఇంటి పనులు చేస్తూ, అందరి ఆలనా పాలనా చూస్తుంది. ఒకవేళ భర్త దుర్మార్గుడు అయిన భరిస్తుంది. పుట్టినింటి వాళ్ళు ఒక మాట తన భర్త ని ఎమన్నా అన్న సహించదు.. తెలిసి తెలియని వయసు లో వాంతులు, నీరసం ఏమి అయిందో కూడా పాపం తెలియని పరిస్థితి లో అయోమయలో కంగారుపడిపోతుంది.. అపుడు తెలుస్తుంది తన కడుపులో ఒక "బిడ్డ " ఉందన్న విషయం..
అపుడు చుడాలి అ ఆడపిల్ల ముఖం ఎంత వెలిగిపోతుందో. అప్పటిదాకా తను పడ్డ కష్టాలు అన్ని మరిచిపోయి "తన చేయి ని తన పొట్ట మీద పెట్టుకుని ఎంతో మధురానుభూతి పొందుతుంది మన అమ్మ.
తొమ్మిది నెలలు మనల్ని మోసి, మందులు మింగి, వాంతులతో, ఇంట్లో పనితో అలిసిపోయి సొలిసిపోయి, మనకి జన్మ నిచ్చింది. పురిటి నొప్పులు అనుభవించి మనల్ని భూమి మీదకి రప్పిoచింది అమ్మ. "మరో జన్మ అమ్మ కి ఇది " ఎంత బాధని పడ్డ గాని అపుడే పుట్టిన మనల్ని చూసుకుని, మన బుజ్జి బుజ్జి చేతులు, కాళ్ళను చూసుకుని, మనకి ముద్దుపెట్టుకుని తన బాధని మర్చిపోతుంది.. మనల్ని పెద్దవాళ్ళని చేసి, ప్రయోజకుల్ని చేసి పెళ్లి చేసి ఒక ఇంటివాళ్ళని చేస్తుంది. కన్నా దగ్గర నుండి పెంచేదాకా ఎన్నో ఒడిదుడుకులని తట్టుకుని మనల్ని కంటికి రెప్పలా కాపాడుతుంది" తల్లి "..!!
మీరు నిజం అని భావిస్తే ఒక్కసారి మీ అమ్మ కి "ఐ లవ్ యూ అమ్మ" అని చెప్పి మీ ప్రేమని చాటండి... ! అమ్మని ప్రేమిద్దాం..!!అమ్మ మనసుని అర్ధం చేసుకుందాం.. !!