వెల్లుల్లి రసంతో ఎన్ని ఉపయోగాలో తెలుసా?

frame వెల్లుల్లి రసంతో ఎన్ని ఉపయోగాలో తెలుసా?

Durga Writes

వెల్లుల్లి రసం.. ఆరోగ్యానికి ఎంతో మంచి రసం ఇది. వెల్లుల్లిలో ఎనో ఔషధ గుణాలు ఉంటాయి.. ఈ గుణాలు అన్ని మనకు ఎంతో సహాయం చేస్తాయి. అలా ఆరోగ్యానికి ఎంతో సహాయం చేసే ఈ వెల్లుల్లి చారుతో ఎన్నో ఉపయోగాలు ఉంటాయి.. అన్ని ఔషధ గుణాలు ఉన్న ఈ వెల్లుల్లి చారుని ఎలా చెయ్యాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

కావాల్సిన పదార్దాలు.. 

 

చింతపండు - 50గ్రాములు, 

 

ఉల్లిపాయలు - రెండు, 

 

వెల్లుల్లి - 8 రెబ్బలు, 

 

కరివేపాకు - కట్ట, 

 

కొత్తిమీర - కట్ట, 

 

పసుపు - అర టీ స్పూను, 

 

పంచదార - 3 టీస్పూన్లు, 

 

ఉప్పు - తగినంత, 

 

ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి - తగినంత. 

 

తయారీ విధానం.. 

 

రెండు లీటర్ల నీళ్లలో చింత పండు రసం తీసి స్టవ్‌ మీద పెట్టి మరిగించాలి.. ఆతర్వాత ఓ పాన్‌లో నూనె వేసి తాలింపు వేశాక అందులోనే చిదిమిన వెల్లుల్లి, సన్నగా తరిగిన ఉల్లి ముక్కలు, పసుపు వేసి బాగా వేయించాలి. ఆతరవాత అది అంత కూడా బాగా మరుగుతున్న చింతపండు రసంలో వేసి తిప్పాలి. ఇప్పుడు ఆ రసంకు సరిపడా ఉప్పు వేసి మరో పావుగంట మరిగించాక దించేముందు పంచదార, కరివేపాకు తురుము, కొత్తిమీర తురుము వేసి మరో ఐదు నిమిషాలు మరిగించి దించాలి. అంతే.. అద్భుతమైన వంటకాలు రెడీ అయిపోతాయి.. ఎంతో అద్భుతమైన.. ఆరోగ్యమైన వెల్లుల్లి రసం రెడీ అయిపోతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: