య‌మ్మీ య‌మ్మీ `అరటిపండు హల్వా`

Kavya Nekkanti

కావాల్సిన ప‌దార్థాలు:
పెద్ద అరటిపండ్లు- ఆరు
పంచదార- రెండున్నర కప్పులు
మైదాపిండి- ఒకటింపావు కప్పు

 

వెనీలా ఎసెన్స్‌- ఒక టేబుల్‌ స్పూను
నెయ్యి- ఒకటింపావు కప్పు
జీడిపప్పు- కొద్దిగా

 

తయారుచేసే విధానం: 
ముందుగా అరటిపళ్లను ముక్కలుగా క‌ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్‌పై పాన్ పెట్టి అందులో నెయ్యి వేసి అది వేడెక్కాక అరటిపండు ముక్కలు వేసి వేయించాలి. ముక్కలు చల్లారాక మెత్తగా చేయాలి. దీనికి మైదాపిండి చేర్చి బాగా కలిపి, మిగిలిన నెయ్యి, పంచదార చేర్చి పిండిని బాగా కలుపుతూ వేగించాలి. పంచదార పాకంలా వచ్చిన తర్వాత వేయించిన జీడిపప్పు, వెనీలా ఎసెన్స్‌ వేసి కలపాలి. 

 

ఇప్పుడు స్టీలు ప్లేట్‌లో బాగా నెయ్యి పూసి, హల్వా మాదిరిగా తయారైన స్వీట్‌ను పళ్లెంలో పోసి వెడల్పుగా చేయాలి. తర్వాత కావలసిన షేప్స్‌లో ముక్కలు క‌ట్ చేసుకుంటే స‌రిపోతుంది. అంతే అరటిపండు హల్వా రెడీ. అర‌టి పండు ఆరోగ్యానికి చాలా మంచిద‌న్న విష‌యం తెలిసిందే. అయితే అర‌టి పండును విడిగా తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌ని వారు ఇలా చేసుకుని తింటే చాలా బాగా ఇష్ట‌ప‌డ‌తారు. సో.. త‌ప్ప‌కుండా ట్రై చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: