పాలకూర చికెన్ తిన్నారా ?

Durga Writes

చికెన్.. మాంసాహారులు అందరూ మొదట ఇష్టపడేది ఈ చికెన్ నే. ఎన్నో రకాలుగా రుచికరంగా చేసుకునే ఈ చికెన్ ని చిన్న పిల్ల నుండి పెద్దవారి వరుకు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. అలాంటి ఈ చికెన్ తో పాలకూర చికెన్ ఎలా తినాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. ఎంతో రుచికరమైన పాల కూర చికెన్ చేసుకొని తినండి. 

 

కావలసిన పదార్థాలు.. 


 పాలకూర - అరకేజీ, 

 

బోన్‌లెస్‌ చికెన్‌ - అరకేజీ, 

 

నూనె - తగినంత, 

 

ఉప్పు - రుచికి సరిపడా, 

 

పచ్చిమిర్చి - రెండు, 

 

జీలకర్రపొడి - పావు టీస్పూన్‌, 

 

ఉల్లిపాయ - ఒకటి, 

 

అల్లం - చిన్నముక్క, 

 

వెల్లుల్లి రెబ్బలు - నాలుగు.

 

తయారీ విధానం.. 

 

పాలకూరను పావుగంట పాటు నీటిలో నానబెట్టి, తరువాత శుభ్రంగా కడగాలి. చికెన్‌ను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఒక పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక చికెన్‌ ముక్కలు వేసి వేగించాలి. ఉప్పు, జీలకర్ర పొడి వేసి కలపాలి. కాసేపు వేగిన తరువాత ఒక పాత్రలో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. కుక్కర్‌లో పాలకూర వేసి, కొన్నినీళ్లు పోసి చిన్నమంటపై నాలుగు విజిల్స్‌ వచ్చేంత వరకు ఉడికించి పక్కన పెట్టాలి. మరొక పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఉల్లిపాయలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, తగినంత ఉప్పు వేసి వేగించాలి. కాసేపు వేగిన తరువాత కొన్ని నీళ్లు పోసి చిన్నమంటపై ఉడికించాలి. ఇప్పుడు వేగించి పెట్టుకున్న చికెన్‌ ముక్కలు వేయాలి. కాసేపయ్యాక పాలకూర వేసి మరో ఐదు నిమిషాల పాటు ఉడికించాలి. అంతే... నోరూరించే పాలకూర చికెన్‌ రెడీ. వేడి వేడి అన్నంతో గానీ, చపాతీతో గానీ తింటే రుచిగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: