శృంగారం చేస్తున్నప్పుడు పురుషులు ఇలా చేయడం వల్ల మహిళలు ఈ బాధలు ఎదుర్కొంటారట ..
పరస్పర అంగీకారంతో సెక్స్ చేస్తున్న సమయంలో మహిళల మీద హింస సాధారణమైపోయిందని ఉద్యమకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.యూకేలోని 40 ఏళ్లలోపు మహిళల్లో మూడింట ఒక వంతు మంది శృంగారం సమయంలో పురుషుడి నుంచి అకారణంగా చెంప దెబ్బలు, నోరు మూయడం, ఉమ్మడం లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని తాజా సర్వేలో వెల్లడైంది.
23 ఏళ్ల యువతి అన్నా మూడు సార్లు అలా వేర్వేరు వ్యక్తుల చేతుల్లో హింసను ఎదుర్కొన్నారు.
ఒక వ్యక్తి తన జుట్టును లాగడం, చెంపల మీద కొట్టడం లాంటి చర్యలతో మొదలుపెట్టి, తర్వాత మెడను గట్టిగా పట్టుకున్నాడని ఆమె చెప్పారు."అతడి చేష్టలతో ఒక్కసారిగా షాకయ్యాను. చాలా ఇబ్బందిపడ్డాను, భయమేసింది" అని ఆమె తెలిపారు.ఇలాంటి హింసను చాలామంది మహిళలు ఎదుర్కొంటున్నారన్న విషయం ఆమె తన బాయ్‌ఫ్రెండ్‌తో మాట్లాడాక తెలిసింది.మరో సందర్భంలో ఒక వ్యక్తి తన గొంతును గట్టిగా పట్టుకుని ఊపిరాడకుండా చేశాడని ఆమె చెప్పారు.
"కొంతమంది మహిళలు ఇలాంటి చర్యలను ఇష్టపడుతుండొచ్చు. కానీ, మహిళలు అందరూ అలాగే కోరుకుంటారని పురుషులు అనుకోకూడదు" అని అన్నా అంటున్నారు.సెక్స్ చేస్తున్న సమయంలో ఎవరైనా ఇలాంటి హింసను ఎదుర్కొన్నారా? అన్న అంశంపై సవాంటా కామ్రెస్ అనే పరిశోధనా సంస్థ యూకేలో ఇటీవల 2,002 మంది 18 నుంచి 39 ఏళ్లలోపు వయసున్న మహిళలతో మాట్లాడింది.
వారిలో 38 శాతం మంది తాము హింసను ఎదుర్కొన్నామని చెప్పారు. తమ అంగీకారం లేకుండానే పురుషులు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తుంటారని, చెంప దెబ్బలు కొట్టడం, ఉమ్మడం, గొంతును గట్టిగా పట్టుకోవడం లాంటివి చేస్తుంటారని వాళ్లు వెల్లడించారు. 31 శాతం మంది ఆ విషయాలు చెప్పాలనుకోవడం లేదని తెలిపారు. అసభ్యకర, హింసాత్మక, ప్రమాదకర చర్యలకు అంగీకరించేలా మహిళల మీద ఒత్తిడి పెరిగిపోతోందని గణాంకాలు చెబుతున్నాయని సెంటర్ ఫర్ విమెన్స్ జస్టిస్ సంస్థ చెప్పింది.
పోర్న్ చిత్రాలు విస్తృతంగా అందుబాటులో ఉండటం, పోర్న్ వీక్షించడం సాధారణమైపోవడమే పురుషుల్లో ఈ ప్రవర్తన పెరగడానికి కారణమని ఆ సంస్థ పేర్కొంది. "తమ భాగస్వాములతో పరస్పర అంగీకారంతో సెక్స్ చేసే సమయంలో నలభై ఏళ్ల లోపు మహిళలు లైంగిక హింసను ఎంతగా ఎదుర్కొంటున్నారో తాజా సర్వే చెబుతోంది. ఒక మహిళ ఒక వ్యక్తితో సెక్స్‌కు అంగీకరిస్తే, దాని అర్థం అతడు ఏం చేసినా ఫరవాలేదని కాదు" అని విమెన్స్ ఎయిడ్ సంస్థ ప్రతినిధి అడినా క్లెయిర్ అన్నారు.
ఒక వ్యక్తితో సెక్సులో పాల్గొన్నప్పుడు, నాకు ఏమాత్రం చెప్పకుండానే నా మీదపడి ఊపిరాడకుండా చేశాడు. అతడి వికృత చేష్టలతో ఒక్కసారిగా షాకయ్యాను. చాలా భయమేసింది. ఏమైనా అంటే అతడు మరింత జులం ప్రదర్శిస్తాడేమో అన్న భయంతో అప్పుడు నేనేమీ అనలేకపోయాను" అని ఎమ్మా (పేరు మార్చాం) చెప్పారు. పోర్న్ ప్రభావం వల్లే అతడు అలా ప్రవర్తించి ఉంటాడని ఆమె అభిప్రాయపడ్డారు. "అతడు అలాంటి చర్యలను ఏదో పోర్న్ వీడియోలో చూసి ఉంటాడు, ఇప్పుడు నాతో కూడా అలాగే చేయాలని అనుకున్నాడని అనిపించింది" అని ఎమ్మా అన్నారు.
"సాధారణ వ్యక్తులు కూడా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. వాళ్లు పోర్న్ ఎక్కువగా చూస్తున్నారని అనిపిస్తోంది. పోర్న్లో చూస్తున్నట్లుగా అందరు మహిళలూ అలాంటి చర్యలను కోరుకుంటారని వాళ్లు అనుకుంటున్నారేమో" అని అన్నా అభిప్రాయపడ్డారు.