దసరా స్పెషల్: రవ్వ బొబ్బట్లు స్పెషల్
భారత దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఎంతో ఇష్టంగా జరుపుకునే పండుగ దసరా. దసరా అంటే సరదా సరదాగా పండుగ..పేద, ధనిక అనే తేడా లేకుండా తమ స్థాయి ప్రకారం కొత్త బట్టలు కుట్టించుకొని అమ్మవారికి పూజ చేసిన సాయంత్రం జమ్మి ఆకు ఇచ్చుకొని ఒకరినొకరు గౌరవించుకుంటారు. చిన్నవాళ్లైతే పెద్దల వద్ద ఆశీర్వాదం తీసుకుంటారు. అయితే దసరాకు వెజ్, నాన్ వెజ్ లు ఎన్నో రకాలుగా వండుకొని తింటుంటారు. ఇక స్వీట్లు కూడా ఎంతో ఇష్టంగా చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టి తింటారు.
దసరా ఒక ముఖ్యమైన హిందువుల పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగకు నవరాత్రి, శరన్నవరాత్రి అనీ అంటారు. దసరా పండుగ నాడు ఎన్నో రకాల పిండి వంటలు, రకరకాల స్వీట్లు, పదార్థాలు తయారు చేస్తారు. వాటిలో ఒక్కటైన రవ్వబొబ్బట్లు అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం అంటారు. మరి ఆ రవ్వబొబ్బట్లు ఏలా చేస్తారో చూద్దామా!